Begin typing your search above and press return to search.

జాన్వీ కూడా శ్రీ‌దేవి లాగే ఎక్స్ట్రా ఇవ్వాలంటోందా?

By:  Tupaki Desk   |   21 Feb 2023 2:01 PM GMT
జాన్వీ కూడా శ్రీ‌దేవి లాగే ఎక్స్ట్రా ఇవ్వాలంటోందా?
X
అతిలోక సుంద‌రిగా పేరు తెచ్చుకున్న దివంగ‌త సీనియ‌ర్ హీరోయిన్ శ్రీ‌దేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ టాలీవుడ్ ఎంట్రీ విష‌యంలో త‌న త‌ల్లినే ఫాలో అవుతూ ఆ విష‌యంలో ఎక్స్ట్రా కావాల్సిందేన‌ని డిమాండ్ చేస్తోందా? అంటే టాలీవుడ్ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

గ‌తంలో శ్రీ‌దేవిని రాజ‌మౌళి 'బాహుబ‌లి' లోని శివ‌గామి పాత్ర కోసం సంప్ర‌దించారు. అయితే అంతా ఓకే కానీ త‌న తో వ‌చ్చే 15 మంది వ్య‌క్తిగ‌త సిబ్బందికి కూడా ప్ర‌త్యేకంగా హోట‌ల్ లో గ‌దులు, ఫుడ్ తో పాటు స‌క‌ల స‌దుపాయాలు ఏర్పాటు చేయాల‌ని శ్రీ‌దేవి డిమాండ్ చేసింద‌ట‌.

అయితే అది న‌చ్చ‌క‌పోవ‌డంతో రాజ‌మౌళి అంత సిబ్బందిని మెయింటైన్ చేయ‌డం ఇష్టం లేక శ్రీ‌దేవిని ప‌క్క‌న పెట్టి ఆ పాత్ర కోసం ర‌మ్య‌కృష్ణ‌ని ఫైన‌ల్ చేసుకోవ‌డం తెలిసిందే. ఇదే విష‌యం అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా వుంటే గ‌త కొంత కాలంగా శ్రీ‌దేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తోంది. త‌న డిమాండ్స్ కార‌ణంగానే ప్ర‌తీ నిర్మాత జాన్వీని టాలీవుడ్ కు ప‌రిచ‌యం చేయాల‌న్న ఆలోచ‌న‌ని విర‌మించుకుంటూ వ‌స్తున్నారట‌.

అయితే ఫైన‌ల్ గా జాన్వీ క‌పూర్ టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. RRR త‌రువాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న 30వ ప్రాజెక్ట్ ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని నెలలుగా వివిధ కార‌ణాల వ‌ల్ల రెగ్యుల‌ర్ షూటింగ్ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌బోతోంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా జాన్వీ క‌పూర్ టాలీవుడ్ లోకి తెరంగేట్రం చేయ‌బోతోంది. అయితే ఈ మూవీలో న‌టించ‌డానికి జాన్వీ ఏకంగా 5 కోట్లు పారితోషికం డిమాండ్ చేసింద‌ట‌. అంతే కాకుండా త‌న వ్య‌క్తిగత సిబ్బందిని కూడా భ‌రించాల‌ని చెప్పింద‌ట‌. అయితే మేక‌ర్స్ మాత్రం 4 కోట్లు మాత్ర‌మే ఇస్తామ‌ని, వ్య‌క్తిగ‌త సిబ్బందికి అయ్యే ఖ‌ర్చుల్ని కూడా భ‌రిస్తామ‌ని చెప్ప‌డంతో జాన్వీ కపూర్ ఫైన‌ల్ గా ఎన్టీఆర్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.