Begin typing your search above and press return to search.

డౌట్! తండ్రి కూతుళ్లు తెర‌ను చింపేస్తారేమో!!

By:  Tupaki Desk   |   21 Jun 2022 5:35 AM GMT
డౌట్! తండ్రి కూతుళ్లు తెర‌ను చింపేస్తారేమో!!
X
తండ్రి కూతుళ్లు క‌లిసి న‌టించ‌డం అనేది అరుదైన సంద‌ర్భ‌మే. కానీ అలాంటి అవ‌కాశం ఈ డాడీ కూచీకి ఒక‌టికి రెండు సార్లు ద‌క్కింది. ఓ సినిమాలో క‌లిసి త‌మ రియ‌ల్ లైఫ్ పాత్ర‌ల‌నే రిపీట్ చేస్తున్న డాడీ అండ్ డాట‌ర్ ఇప్పుడు ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న కోసం క‌లిసి న‌టిస్తున్నారు. ఇదంతా ఎవ‌రి గురించి? అంటే బోనీక‌పూర్ - జాన్వీ క‌పూర్ గురించే. త‌న తండ్రి బోనీక‌పూర్ తో క‌లిసి మిలీ అనే చిత్రంలో న‌టిస్తోంది జాన్వీ. అంత‌కుముందే పాపా బోనీతో క‌లిసి ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో కూడా న‌టించేస్తోంది.

జాన్వీ- బోనీ కపూర్ ఈ బుధ‌వారం నాడు ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. నిజజీవితంలో తండ్రి - కూతురు మొదటిసారిగా రీల్ లైఫ్ లో కూడా తండ్రి కూతుళ్లుగానే క‌నిపించ‌బోతున్నారు. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లోనూ తండ్రి కూతురుగానే క‌నిపిస్తుండ‌డం విశేషం. జూన్ 21న ముంబై నగరంలో యాడ్ షూటింగ్ కి ఆ ఇద్ద‌రూ రెడీ అవుతున్నారు. ఆ ఇద్ద‌రికీ ఇది అరుదైన ఎమోష‌న‌ల్ క్ష‌ణం అన‌డంలో సందేహం లేదు.

బోనీ కపూర్ ఇటీవ‌ల నిర్మాత‌గానే కాదు న‌టుడిగానూ బిజీ అయిపోతున్నారు. ఇన్నేళ్ల‌లో ఆయ‌న ఎప్పుడూ న‌టించింది లేదు. ఈ ఏడాదిలోనే అత‌డు తొలిసారిగా నటుడిగా మారనున్నారు. జాన్వీ న‌టిస్తున్న మిలీకి నిర్మాత‌గా కొన‌సాగుతూనే న‌టుడిగానూ ముఖానికి రంగేసుకుంటున్నాడు. కూతురితో క‌లిసి న‌టిస్తున్నారు. రణబీర్ కపూర్ - శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలలో  లవ్ రంజన్ రూపొందిస్తున్న టైటిల్ నిర్ణ‌యించ‌ని చిత్రంలోనూ న‌టించ‌నున్నాడు.

జాన్వీ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... వ‌రుస‌గా ఈ బ్యూటీ వైవిధ్య‌మైన సినిమాలు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. గుడ్ ల‌క్ జెర్రీ త‌ర్వాత‌ లైనప్ లో రొమాంటిక్ కామెడీ 'దోస్తానా 2' ఉంది. ఈ మూవీ నుంచి కార్తీక్ ఆర్య‌న్ వైదొలిగిన అనంత‌రం చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించిన అప్ డేట్ ని వెల్ల‌డించ‌లేదు.

వరుణ్ ధావన్ తో కలిసి జాన్వీ మిలీ లో న‌టించింది. ఈ చిత్రానికి 2019లో అసలు మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన మాతుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సన్నీ కౌశల్ -మనోజ్ పహ్వా కూడా నటించారు.

జాన్వీ తండ్రి బోనీ కపూర్ ఈ మూవీ నిర్మాత‌ల్లో ఒక‌రు కాగా.. ఇందులో బోనీ త‌న గారాల కుమార్తెతో క‌లిసి న‌టించ‌డం విశేషం. ఇదే కాకుండా రాజ్ కుమార్ రావుతో 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' చిత్రంలోనూ జాన్వీ న‌టిస్తోంది. ఈ మూవీ కూడా విడుద‌ల‌కు రానుంది. అలాగే బవాల్ అనే మ‌రో చిత్రంలోనూ జాన్వీ న‌టిస్తోంది.