Begin typing your search above and press return to search.

శ్రీదేవి అవార్డు కోసం చిన్న కూతురు..

By:  Tupaki Desk   |   3 May 2018 5:36 AM GMT
శ్రీదేవి అవార్డు కోసం చిన్న కూతురు..
X

2018 ఫిబ్రవరి 24ను ఏ భారతీయ సినీ అభిమాని మర్చిపోలేడు. అందాల నటి శ్రీదేవి మరణం ఆ రోజు ఉదయం అందరిని కలచివేసింది. దాదాపు భారతీయ సినీ పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలందరితోని ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. రెండు తారల వారితో హీరోయిన్ గా చేసిన ఆమె ముడవతరంలో మంచి ప్రయోగాత్మక చిత్రాల్ని చేశారు. మామ్ సినిమాకు గాను ఆమె చివరగా ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు.

కొన్ని వారాల కిందట 65వ నేషనల్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ప్రకటించిన అవార్డులను గెలుచుకున్న వారికి అందజేయనున్నారు. ఇక శ్రీదేవి తరపు నుంచి ఆమె చిన్న కూతురు ఖుషి కపూర్ ఉత్తమ నటి అవార్డును అందుకొనున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంకి శ్రీదేవి భర్త మామ్ ప్రొడ్యూసర్ అయిన బోణి కపూర్ హాజరుకానున్నారు. ఆమె పెద్ద కూతురు జాన్వీ కూడా వేడుకకి రానుంది.

నిజంగా శ్రీదేవి కుటుంబానికి ఇదొక ఎమోషనల్ మూమెంట్ అని చెప్పాలి. అలాగే అభిమానులు కూడా ఎంతో భావోద్వేగంతో ఫీల్ అవుతున్నారు. శ్రీదేవి ఉంటే ఈ సమయంలో ఎంత సంతోషించే వారో అని అందరు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. శ్రీదేవి చివరగా నవ్వుతూ చేసిన డ్యాన్స్ వీడియో ఇంకా వైరల్ అవుతూనే ఉంది. ఆమె దుబాయ్ లోని ఒక హోటల్ లో బాత్ టాబ్ లో పడి ఊపిరాడక మరణించిన సంగతి అందరికి తెలిసిందే.