Begin typing your search above and press return to search.
వీడియో: అరుదైన మత్స్యం నడిచొచ్చింది
By: Tupaki Desk | 14 Dec 2022 5:30 AM GMTవేదికపై ఎందరు భామలు ఉన్నా కళ్లన్నీ జాన్వీపైనే..! అంతగా ఆకట్టుకోవడం ఎలానో షో స్టాపర్ గా నిలవడం ఎలానో ఈ కుర్రబ్యూటీకి మాత్రమే తెలుసు. గురూజీ కరణ్ జోహార్- టాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రా సహా ఎందరో జాన్వీకి మార్గదర్శకులుగా ఉన్నారు. పాపా బోనీ నుంచి అన్నివిధాలా సలహాలు సూచనలు అందుతున్నాయి. ఫ్యాషన్ ప్రపంచంలో రాకుమారిలా వెలిగిపోయేందుకు తనవెంట ఒక సైన్యంలా వీరంతా సహకరిస్తున్నారు. ఇప్పటికే చాలా ఈవెంట్లో జాన్వీ షో స్టాపర్ గా నిలిచింది. సాటి యువనాయికలు సైతం కుళ్లుకునేలా విలక్షణమైన డ్రెస్సింగ్ సెన్స్ తో మెప్పించింది. విమర్శలొస్తున్నా కానీ.. చాలాసార్లు జాన్వీ బోల్డ్ లుక్ లో కనిపించేందుకు వెనకాడడం లేదు.
తాజాగా జాన్వీ కపూర్ నైకా ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2022లో అబ్బురపరిచింది. నియాన్ గ్రీన్ కలర్ డిజైనర్ లాంగ్ డ్రెస్ లో జాన్వీ అప్పియరెన్స్ కళ్లు తిప్పుకోనివ్వలేదంటే అతిశయోక్తి కాదు. ఈ ఈవెంట్లో సాటి నాయికలు సారా అలీఖాన్ ..కృతి సనోన్.. తేజస్వి ప్రకాష్ లాంటి టాప్ బ్యూటీలు ఉన్నా వేదికపై జాన్వీ కపూర్ కేంద్రక ఆకర్షణగా మారింది.
నైకా ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2022 వేడుకల్లో జాన్వీ హద్దులు చెరపేసి సందడి చేసింది. ఈవెంట్ థీమ్ -'ది లీగ్ ఆఫ్ గ్లాంపియన్స్' టైటిల్ కి తగ్గట్టుగా తన ప్రదర్శనతో అదరగొట్టింది. నైకా వ్యవస్థాపకుడు - చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫల్గుణి నాయర్ సహా పలువురు టాప్ సెలబ్రిటీలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఫ్రెడ్డీ నటుడు కార్తీక్ ఆర్యన్- మలైకా అరోరా- మోనికా డోగ్రా- రాణి కోహెనూర్- నిక్కీ తంబోలి- దీపా బుల్లెర్ ఖోస్లా సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముంబయిలో జరిగిన అత్యున్నత అవార్డుల కార్యక్రమం ఇది. వేదికపై జాన్వీతో పాటు కృతి సనన్- సారా అలీ ఖాన్ - ఆయుష్మాన్ ఖురానా- విక్కీ కౌశల్ - కార్తీక్ ఆర్యన్ ల మెరుపులు కనిపించాయి. ఈ ఈవెంట్ లో బాలీవుడ్ తారలు తమ అత్యుత్తమ ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకున్నారు.
సోషల్ మీడియా క్వీన్ గాను..వేదిక ఏదైనా కానీ అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గని జాన్వీ కపూర్ కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియా క్వీన్ గా వెలిగిపోతూ లక్షల్లో ఫాలోవర్స్ ని సంపాదించింది. కేవలం ఇన్ స్టాలో దాదాపు 2.3 కోట్ల (20.3 మిలియన్లు) ఫాలోవర్లతో దుమ్ము రేపుతోంది. సోషల్ మీడియాలో తన గ్లామ్ ఇమేజ్ గురించి రకరకాలుగా చర్చ సాగుతోంది. ఇటీవలి కాలంలో వరుస ఫోటోషూట్లతో జాన్వీ టూమచ్ గా విరుచుకుపడుతోందనే టాక్ ఉంది. సోషల్ మీడియాలు తనకు వినోదం కోసం ఉపయోగపడే అడ్డాలు అని తాను చేస్తున్న ఫోటోషూట్లు సరదా కోసమని కూడా ఇంతకుముందు ఓపెనైంది.
ప్రయోగాల్లో తగ్గేదే లే..!కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రతిభావంతురాలైన జాన్వీ ఇప్పటికే కెరీర్ లో దూసుకుపోతోంది. కొన్ని అసాధారణమైన పాత్రల ఎంపికతో అద్భుత నట ప్రదర్శనలతో మనసులు దోచింది. ప్రత్యేకమైన ఎంపికలతో పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.
ఇటీవల విడుదలైన సర్వైవల్ డ్రామా మిలీలో జాన్వీ నటనకు గొప్ప ప్రశంసలు కురిసాయి. ఈ చిత్రం పాజిటివ్ సమీక్షలను అందుకుంది. ప్రశంసలు పొందిన మలయాళ చిత్రం హెలెన్ కి అధికారిక రీమేక్ ఇది. కష్టపడి పనిచేసే యువతి మిలీగా టైటిల్ పాత్రలో జాన్వీ నటించింది.
రాజ్ కుమార్ రావ్ తో మళ్లీ కలిసి పని చేయనుంది. అలాగే రొమాంటిక్ కామెడీ 'బవాల్'లో నటించనుంది. ఈ మూవీతో తన కెరీర్ లో మొదటిసారి వరుణ్ ధావన్ తో స్క్రీన్ ను పంచుకోనుంది. త్వరలో టాలీవుడ్ లోను ఆరంగేట్రం చేయనుంది. జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ కథానాయికగా నటించే ఛాన్సుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.