Begin typing your search above and press return to search.
పాపా బోనీ నటరంగ ప్రవేశంపై జాన్వీ ఉత్సుకత!
By: Tupaki Desk | 4 Aug 2022 8:30 AM GMTమూడు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా స్థిరపడిన బోనీ కపూర్ తన నటనా రంగ ప్రవేశాన్ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు లవ్ రాంజన్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ కామెడీ (టైటిల్ ఫిక్స్ చేయలేదు)లో అతడు నటిస్తున్నాడు. రణబీర్ కపూర్ -శ్రద్ధా కపూర్ ఈ చిత్రం లో నాయకానాయికలుగా నటిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ ని తన తండ్రి బోనీ నటిస్తున్న సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదని తెలిపింది. ''వాళ్ల సినిమా టైటిల్ వాళ్లకు కూడా తెలియదు.. అడిగినా కానీ నా దగ్గర దాచేస్తున్నారు'' అంటూ జాన్వీ నవ్వేసింది. బోనీ కపూర్ నటనా రంగ ప్రవేశం గురించి జాన్వీ ముచ్చటిస్తూ.. తాను పాపా గురించి భయాందోళనలకు గురవుతున్నానని.. కానీ చాలా ఉత్సాహంగా ఉన్నానని జాన్వీ తెలిపింది.
సినిమాలో పాపా బోనీకపూర్ (నిర్మాత పాత్ర)గా నటిస్తున్నందున నేను చాలా భయపడుతున్నాను. నాన్న అసలు ఎలా ఉంటాడో ప్రేక్షకులు చూస్తారు. సినిమా కోసం చాలా రోజులు షూటింగులో పాల్గొన్నాడు కాబట్టి నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను.. అని తెలిపింది. నేను డైలాగులు విన్నాను.. పాపాకు పంచ్ లైన్స్ ఉన్నాయి అంటూ జాన్వీ వెల్లడించింది.
రణబీర్ కపూర్.. రణవీర్ సింగ్ ఇద్దరితోనూ సినిమాలు చేయాలని భావిస్తున్నట్టు జాన్వీ తెలిపింది. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలని అడిగినప్పుడు.. చాలా సార్లు తేదీలు క్లాష్ అయ్యి చివరికి ఆ ఇద్దరితో సినిమాలు చేయలేకపోయాను.
ఈసారి ఎలా అయినా నేను మ్యానేజ్ చేసి రణబీర్ .. రణ్ వీర్ లతో సినిమాలు చేస్తాను.. అని అంది. ప్రతిసారీ తేదీలు క్లాష్ అవుతున్నాయి. ఇకపై వాటిని ఎలా మ్యానేజ్ చేయాలో నాకు మాత్రమే తెలుసు.. అని అంది.
జాన్వీ తదుపరి చిత్రాలలో వరుణ్ ధావన్ తో నితేష్ తివారీ 'బవాల్' చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం 'మిస్టర్ ఔర్ మిసెస్ మహి' కోసం ప్రిపరేషన్ లో బిజీగా ఉంది, ఇందులో ఆమె క్రికెటర్ అవతార్ లో కనిపించనుంది. ఇటీవల గుడ్ లక్ జెర్రీ మూవీలో నటనకు ప్రశంసలు అందుకుంది.