Begin typing your search above and press return to search.

అబ్బా.. న్యూడ్ ఫొటోషూట్ పై అమ్మడు ఏం చెప్పింది ఏం చెప్పిందీ..!

By:  Tupaki Desk   |   30 July 2022 11:30 PM GMT
అబ్బా.. న్యూడ్ ఫొటోషూట్ పై అమ్మడు ఏం చెప్పింది ఏం చెప్పిందీ..!
X
బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ఇటీవల న్యూడ్ ఫోటో షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ మ్యాగజైన్ కోసం ఒంటి పై నూలు పోగు లేకుండా ఫొటోలకి ఫోజులివ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాప్ ఐకాన్ బర్ట్ రేనేల్డ్స్ నివాళిగా నగ్నంగా దర్శనమిచ్చిన రణవీర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో అతనిపై కేసు కూడా నమోదైంది.

రణ్ వీర్ సింగ్ సోషల్ మీడియాలో న్యూడ్ ఫొటోలను పోస్ట్ చేయడం ద్వారా మహిళల గౌరవానికి భంగం కలిగించారని.. వారి మనోభావాలు దెబ్బ తీశారంటూ చెంబూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే నగ్న చిత్రాల విషయంలో పలువురు నటీమణులు రణ్వీర్ కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు.

ఇప్పటికే అలియా భట్ - విద్యాబాలన్ వంటి బాలీవుడ్ హీరోయిన్లు రణవీర్ కు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. రణవీర్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని.. తన స్నేహితుడికి అండగానే ఉంటానని అలియా తెలిపింది. న్యూడ్ ఫొటోషూట్లపై మీడియా మిత్రులు అడుగుతున్న ప్రశ్నలను తాను జీర్ణించుకోలేకపోతున్నాని.. ఇండస్ట్రీలో రణవీర్ ను అందరూ ప్రేమించే వారేనని.. ప్రస్తుతం వ్యవహరంపై నెగెటివ్ గా మాట్లాడలేమని పేర్కొంది.

ఒక వ్యక్తి ఇలా నగ్నంగా ఫోటో షూట్స్ చేయడం మొదటిసారి కాదు కదా.. అందులో సమస్య ఏముంది? మనం కూడా అవి చూసి ఆనందించాలి అని విద్యా బాలన్ నవ్వుతూ మాట్లాడింది. తాజాగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సైతం రణ్ వీర్ సింగ్ కి మద్దతు తెలిపింది.

ఢిల్లీలో రిలయన్స్ డిజిటల్ షోరూమ్ ని ప్రారంభించిన జాన్వీ.. రణ్ వీర్ న్యూడ్ పిక్స్ పై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది. ''అది కళాత్మక స్వేచ్ఛ అని నేను భావిస్తున్నాను. దాన్ని ఎవరినైనా విమర్శించడం లేదా విశ్లేషించడం సరైన పద్ధతి కాదని అనుకుంటున్నాను'' అని జాన్వీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

అబ్బా జాన్వీ ఏం చెప్పింది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నగ్నంగా ఫోటోలు దిగడం కళాత్మక స్వేచ్ఛ అవుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే లేటెస్టుగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సైతం నగ్నంగా ఫోటో షూట్ చేయడానికి తనకు అభ్యంతరం లేదని అన్నాడు.

'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో పాల్గొన్న VD.. 'ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కోసం రణ్ వీర్ సింగ్ లా న్యూడ్ ఫొటో షూట్ చేయాల్సి వస్తే ఒప్పుకొంటారా?' అని కరణ్ అడగ్గా.. బాగా తీస్తే అలాంటి ఫొటోషూట్ లో పాల్గొనడానికి తాను ఇబ్బందిపడనని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు.

ఇప్పటికే 'లైగర్' పోస్టర్ లో నగ్నంగా కనిపించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని అనన్య పాండే సైతం ప్రస్తావించింది. 'విజయ్ ని న్యూడ్ గా చూడాలని అనుకుంటున్నావా?' అని కరణ్ అడగ్గా.. 'లైగర్' లో చాలావరకు అలానే చూశానని చెప్పుకొచ్చింది.