Begin typing your search above and press return to search.
వీడియో: అంబానీల వేడుకలో కుర్ర బ్యూటీని వెంటాడారు!
By: Tupaki Desk | 30 Dec 2022 3:50 AM GMTముఖేష్ - నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీకి పారిశ్రామిక వేత్త కుమార్తె రాధిక మర్చంట్ తో నిశ్చితార్థం జరిగింది. రాజస్థాన్ నాథ్ ద్వారాలో ఈ జంట నిశ్చితార్థ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుక ముగిశాక అంబానీలు చాలా కోలాహలంగా పూల వర్షం కురుస్తుండగా ముంబైలోని తమ స్వగృహానికి తిరిగి వచ్చారు.
వరల్డ్ రిచెస్ట్ బిజినెస్ మేన్ అంబానీ ఇంటికి వచ్చే క్రమంలో అతడి ఇంటి ముందు క్యూ కట్టింది ఎవరో తెలిస్తే షాకవ్వాలి. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు ప్రముఖ సెలబ్రిటీలు అంబానీల యాంటిలియాకు చేరుకున్నారు. ఆకాష్-శ్లోకా అంబానీలతో చాలా సన్నిహితంగా ఉండే రణబీర్ కపూర్ - అలియా భట్ మొదట అక్కడికి చేరుకున్నారు. కొత్త జంటను విష్ చేసారు. ఈ విజిట్ లో రణబీర్ నలుపు రంగు దుస్తుల్లో అందంగా కనిపించాడు. కాగా అలియా తెలుపు దుస్తుల్లో అందంగా కనిపించింది. వారితో పాటు వారి బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఉన్నారు.
ఇంతలోనే ఆ పరిసరాల్లో ఒక మెరుపు మెరిసింది. ఉరుము ఉరిమింది. అక్కడ పింక్ తళుకులతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అందాల నటవారసురాలు.. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా ఆంటిల్లాకు విచ్చేయడంతో అక్కడ కళ్లన్నీ అటువైపు వాలిపోయాయి.
జాన్వీ ఆరు గజాల పింక్ చీరలో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. పింక్ గులాబీ చీరలో రిఫ్రెషింగ్ లుక్ తో కనిపించింది. ఓంబ్రే పింక్ చీర.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో షో స్టాపర్ గా నిలిచింది. నిగనిగలాడే దొండ పెదవులు.. కలరైజ్డ్ హెయిర్... లైట్ మేకప్ తన అందాన్ని రెట్టింపు చేసాయి. వేదిక వద్ద గాలికి ఎగురుతున్న ఆ శిరోజాలను ఒక చేత్తో సవరించుకుంటూనే అంటిల్లా పరిసరాల్లో ఫోటోగ్రాఫర్లకు సహకరిస్తూ ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు వెబ్ లో దుమారం రేపుతున్నాయి. జాన్వీ అందచందాలు ఒక మైమరుపు. పింక్ చీరలో జాన్వీ అలా అలా నడిచొస్తుంటే ఈవెంట్ వద్ద అహూతుల చూపులు తిప్పుకోలేక సతమతమయ్యారు. ఈవెంట్ వద్ద జాన్వీ షో స్టాపర్ గా నిలిచింది.
రాధిక మర్చంట్ ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ CEO అయిన పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె. అనంత్ - రాధిక కొన్ని సంవత్సరాలుగా ఒకరికొకరు సుపరిచితులు. ప్రేమలో ఉన్నారు. ఈ రోజు వేడుక తో ప్రేమ బంధం అధికారికమైంది. నేటి నుంచి ఈ జంట కొత్త ప్రయాణం మొదలైంది. కొన్ని నెలల్లో వివాహం జరగనుందని తెలిసింది.
అంబానీల నిశ్చితార్థ వేడుక వివరాల్లోకి వెళితే... 28 డిసెంబర్ తెల్లవారుజామున రాజస్థాన్ లోని నాథ్ ద్వారాలో ఈ నిశ్చితార్థం జరిగింది. అనంతరం అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ముంబైకి తిరిగి వచ్చినప్పుడు ఈ జంటకు అత్యంత సన్నిహితులు ఇతర ప్రియమైన వారి నుండి గొప్ప స్వాగతం లభించింది. రణబీర్ కపూర్- అలియా భట్- రణ్ వీర్ సింగ్ -జాన్వీ కపూర్ వంటి పలువురు ప్రముఖులు కొత్తగా నిశ్చితార్థం చేసుకున్న జంటను అభినందించేందుకు ముఖేష్ అంబానీ నివాసం అయిన యాంటిలియాకు చేరుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.