Begin typing your search above and press return to search.
కపూర్ డాటర్ షో: పెళ్లిలోనే కాదు రిసెప్షన్ లోనూ కళ్లన్నీ జాన్వీపైనే
By: Tupaki Desk | 17 Aug 2021 4:24 AM GMTబాలీవుడ్ లో కపూర్ వెడ్డింగ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కరోనా థర్డ్ వేవ్ రాక ముందే ఈ పెళ్లి సందడి ఇంటా బయటా చర్చల్లోకొచ్చింది. సింపుల్ గా కొద్దిమంది అతిథులతో ఘనమైన విందు కూడా పూర్తయింది. ఈ విందులో కపూర్ డాటర్స్ మెరుపులే మెరుపులు.. మిరుమిట్లు!
అనిల్ కపూర్ కూతురు .. నిర్మాత రియా కపూర్ ఆగస్టు 14న కరణ్ బూలానీని పెళ్లాడిన సంగతి తెలిసినదే. అనిల్ కపూర్ ఇంట్లో కొద్ది మంది బంధుమిత్రులు సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అనంతరం రియా తండ్రి సన్నిహితులు కుటుంబ సభ్యుల కోసం ఒక చిన్న రిసెప్షన్ ను నిర్వహించారు. ఈ వేడుకలో సంజయ్ కపూర్ - మహీప్ కపూర్ - జహాన్ కపూర్- అనిల్ కపూర్- ఫరా ఖాన్,- మసాబా గుప్తా,- పూజా ధింగ్రా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ వేదిక ఆద్యంతం జాన్వీ హంగామా గురించి తెలిసినదే. కపూర్ డాటర్ మిరుమిట్లు గొలిపే అందం కేంద్రక ఆకర్షణగా నిలిచింది. అనంతరం రిసెప్షన్ లో క్యాజువల్ లుక్ లో నూ జాన్వీ కపూర్ హీటెక్కించింది. వేదిక వద్ద బ్లూ టాప్ వైట్ బాటమ్ తో అదరగొట్టింది. ఇక ఇదే వేదికపై మరో ఇద్దరు సిస్టర్స్ షోస్టాపర్స్ గా నిలిచారు. జాన్వీ సోదరి ఖుషి కపూర్ - మరో సోదరి అన్షులా కపూర్ కూడా రియా- కరణ్ ప్రత్యేక పార్టీ కి హాజరయ్యారు. వివాహానంతర వేడుకల నుండి ఇంటర్నెట్ ని హీటెక్కించే అద్భుతమైన చిత్రాలపై యూత్ చర్చ ఓ రేంజులో సాగుతోంది.
ఈ పార్టీకి మరింత గ్లాం జోడించడానికి జాన్వీ కపూర్ అండ్ సిస్టర్స్ బృందం ఎంతో స్టైలిష్ లుక్ తో రావడంపై ఎక్కువ చర్చ సాగింది. అనిల్ కపూర్ జుహు బంగ్లాలో వీరంతా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.అయితే వేదిక వద్ద ఎందరు ఉన్నా కళ్లన్నీ జాన్వీ పైనే. ఆ తర్వాత తన సిస్టర్స్ వైపు మళ్లాయి. జాన్వి ట్యూబ్ పౌడర్ బ్లూ గ్లిటరీ టాప్ ధరించి తెల్లని మెరిసే ప్యాంటు ధరించింది. ఆమె అద్భుతమైన రూపాననికి మల్టీ లేయర్డ్ నెక్ పీస్ ని జోడించింది. జాన్వీ వివాహ వేడుకలకు వచ్చిన వెంటనే కెమెరాలు క్లిక్ లతో హోరెత్తించాయి. ఆమె మిరుమిట్ల ఫ్లాష్ ల కోసం పాజ్ అవుతూ పోజులిచ్చింది.
బాలీవుడ్ మెరుపుతీగ కలల రాణి
బాలీవుడ్ యువనాయికల్లో అత్యంత వేగంగా స్టార్ డమ్ అందుకుంటున్న కథానాయికగా జాన్వీ కపూర్ పేరు మార్మోగుతోంది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాల్లో నటిస్తూ నటిగా పరిణతిని సాధిస్తున్న జాన్వీ కపూర్ మునుముందు పలు భారీ సినిమాలతో అభిమనులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక యువతరాన్ని ఆకర్షిస్తూ జాన్వీ ఇటీవల వరుస ఫోటోషూట్లతో కలల రాణిగా మారింది.
జాన్వీ కపూర్ వినోద పరిశ్రమలో అత్యంత అందమైన ప్రతిభావంతమైన నటీమణులలో ఒకరు. ట్రెండీ ఫ్యాషన్ సెన్స్ ఉన్న నవనాయికగానూ వెలిగిపోతోంది. జాన్వీ ఆల్వేస్ హెడ్ టర్నర్. ఇక ఫిట్నెస్ ఫ్రీక్ గా జాన్వీ డెడికేషన్ గురించి తెలిసినదే.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. 2021 మార్చిలో ఆమె చిత్రం రూహి విడుదలైంది. దీనికి అభిమానుల నుండి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు కూడా ప్రధాన పాత్రలో నటించారు. జాన్వీ కపూర్ తన తదుపరి ప్రాజెక్ట్ మిలి కోసం షూటింగ్ ప్రారంభించినట్లు తెలిసింది. ఈ చిత్రం మలయాళ చిత్రం - హెలెన్ కి హిందీ రీమేక్. మలయాళ వెర్షన్ కి చిత్రానికి దర్శకత్వం వహించిన మత్తుకుట్టి జేవియర్ దీనికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. హెలెన్ లో అన్నా బెన్ నటించింది. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. కరణ్ జోహార్ దోస్తానా 2లోనూ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.