Begin typing your search above and press return to search.
స్టార్ కిడ్ కు మరో దెబ్బ
By: Tupaki Desk | 13 March 2021 8:30 AM GMTస్టార్ హీరోయిన్ గా దేశ వ్యాప్తంగా స్టార్ డం ను దక్కించుకున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతోంది. శ్రీదేవి మరణించడానికి ముందే ధడక్ మూవీ ప్రారంభం అయ్యింది. కాని కూతురును హీరోయిన్ గా వెండి తెరపై చూడక ముందే శ్రీదేవి కన్నుమూశారు. జాన్వీ కపూర్ కు ఉన్న స్టార్ డం నేపథ్యంలో ధడక్ సినిమా సాదా సీదాగా ఉన్నా కూడా జనాలు చూసేందుకు ఆసక్తి చూపించారు. ఎందుకంటే శ్రీదేవి కూతురు మొదటి సినిమా కనుక. ఆ తర్వాత వచ్చిన బ్యాక్ టు బ్యాక్ సినిమా లను జనాలు తిరష్కరిస్తూ వస్తున్నారు. జాన్వీ కపూర్ తన ఇమేజ్ కు తగ్గట్లుగా తన ప్రతిభకు తగ్గట్లుగా అనుభవానికి తగ్గట్లుగా కథలను ఎంపిక చేసుకోవడం లో విఫలం అవుతోంది.
మొదటి సినిమా ధడక్ తర్వాత ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ ను చేసింది. అందులో జాన్వీ పెద్దగా ఆకట్టుకున్న దాఖలాలు ఏమీ లేవు. ఆ తర్వాత ఒక సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించింది. గత ఏడాది గుంజన్ సక్సేనా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శలను మూట కట్టుకుంది. జాన్వీ తాజాగా 'రూహి' సినిమా తో వచ్చింది. ఈ సినిమా పై ఆమె చాలా ఆశలే పెట్టుకుంది. కాని ఆమెకు మళ్లీ నిరాశ తప్పలేదు. హర్రర్ కామెడీ అంటూ రూపొందిన రూహి సినిమా ప్రేక్షకులకు పిచ్చెక్కించింది. మొన్న శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆటతోనే ప్లాప్ అని తేలిపోయింది.
శ్రీదేవి కూతురు అనే బ్రాండ్ జాన్వీ కపూర్ కు ఉన్నా దాన్ని సరిగ్గా వాడుకోలేక పోవడంతో పాటు సినిమాల ఎంపిక విషయంలో బ్యాక్ టు బ్యాక్ తప్పుడు నిర్ణయాలను ఆమె తీసుకుంటుందనిపిస్తుంది. మరో రెండు మూడు సినిమాల ఫలితాలు ఇలాగే ఉంటే జాన్వీ కపూర్ ను ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ వర్గాల వారు కూడా పట్టించుకోక పోవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.