Begin typing your search above and press return to search.

7రోజుల్లో `ధ‌డ‌క్` 50కోట్లు

By:  Tupaki Desk   |   28 July 2018 5:09 AM GMT
7రోజుల్లో `ధ‌డ‌క్` 50కోట్లు
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి పెద్ద కుమార్తె జాన్వీ న‌టించిన మొద‌టి చిత్రం `ధ‌డ‌క్‌` ఇటీవ‌ల రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఘ‌న‌మైన ఓపెనింగుల‌తో ఆశించిన ఫ‌లితాన్ని అందించింది. కేవ‌లం మూడు రోజుల్లో 30కోట్లు వ‌సూలు చేసి జాన్వీ క్రేజును అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా చెప్పిన ధ‌డ‌క్‌ తొలి వారం వ‌సూళ్ల ధ‌మాకా మోగించింది. ధ‌డ‌క్ కేవ‌లం 7 రోజుల్లో 50కోట్లు వ‌సూలు చేసింది. ఇంత పెద్ద మొత్తం అంటే స్టార్ హీరోల వార‌సుల‌కే సాధ్యం కావ‌డం లేదు. అలాంటిది జాన్వీ క్రేజుతో సాధ్య‌మైందంటే అదంతా శ్రీ‌దేవి మాయ అనే చెప్పాలి. మామ్ శ్రీ‌దేవికి కూతురి విజ‌యాన్ని క‌నులారా వీక్షించే అదృష్టం లేక‌పోయినా, ప్ర‌స్తుతం క‌పూర్ ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంది.

ధ‌డ‌క్ మ‌రో వారం ఆడితే బ‌డ్జెట్‌ మొత్తం రిక‌వ‌రీ అవుతుంది. అటుపై లాభాలు అందుకునే ఛాన్సుంటుంది. ఈ చిత్రానికి ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ఏకంగా 70కోట్ల మేర బ‌డ్జెట్ పెట్ట‌డంతో ఆ మేర‌కు షేర్ వ‌సూలు చేయాల్సిన స‌న్నివేశం ఉంది. ఇక జాన్వీ క్రేజు అటు అమెరికా స‌హా విదేశాల్లోనూ వ‌ర్క‌వుట‌వ్వ‌డంతో ఈ చిత్రం ఫుల్ ర‌న్‌లో సేఫ్ ప్రాజెక్టు అవుతుంద‌నే అంచ‌నా వేస్తున్నారు. ఇదే చిత్రంలో జాన్వీ స‌ర‌స‌న షాహిద్ త‌మ్ముడు ఇషాన్ ఖ‌త్త‌ర్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. డెబ్యూలు ఇద్ద‌రికీ మంచి పేరు తెచ్చింది ధ‌డ‌క్‌. 100 కోట్ల క్ల‌బ్‌లో చేరి మ‌రింత‌గా ఉర‌క‌లెత్తిస్తుందేమో చూడాలి.