Begin typing your search above and press return to search.

కుర్ర‌హీరోతో యంగ్ బ్యూటీ డేటింగ్?

By:  Tupaki Desk   |   8 Oct 2019 4:24 AM GMT
కుర్ర‌హీరోతో యంగ్ బ్యూటీ డేటింగ్?
X
`ధ‌డ‌క్` చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అయ్యింది జాన్వీ. అదే చిత్రంతో షాహిద్ క‌పూర్ సోద‌రుడు ఇషాన్ ఖ‌త్త‌ర్ క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మ‌రాఠా బ్లాక్ బ‌స్ట‌ర్ సైరాఠ్ రీమేక్ అయిన ధ‌డ‌క్ లో ఈ జంట కెమిస్ట్రీ వ‌ర్క‌వుటైంది. డెబ్యూలుగా న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అయితే ఆ సినిమా రిలీజ్ స‌మ‌యంలోనే ఆ ఇద్ద‌రూ డేటింగ్ లో ఉన్నారంటూ ప్ర‌చార‌మైంది. ర‌క‌ర‌కాల సంద‌ర్భాల్లో క‌లిసి షికార్ల‌కు వెళ్ల‌డం కెమెరా క‌ళ్ల‌కు చిక్కింది. అయితే డేటింగ్ వార్త‌ల్ని ఆ ఇద్ద‌రూ ఖండించారు. మేం స్నేహితులం మాత్ర‌మే అని క్లారిటీనిచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఆ త‌ర్వాత కాల‌క్ర‌మంలో కెరీర్ ప‌రంగా.. ఎవ‌రి దారులు వారివి అయ్యాయి.

జాన్వీ ఇప్పుడు క్ష‌ణం తీరిక లేకుండా ఉంది. ఇషాన్ ఖ‌త్తార్ ప‌లు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఇదిగో ఇలా డిన్న‌ర్ డేట్ కోసం క‌లుసుకున్నారు. ఆ ఇద్ద‌రూ క‌లిసి ముంబైలో డిన్న‌ర్ కి వెళ్లారు. క‌లిసి ఒకే కార్ లో వెళ్ల‌డంతో మీడియా ఫోటోగ్రాఫ‌ర్లు కెమెరా ఫ్లాష్ ల‌తో ఊపిరాడ‌నివ్వ‌లేదు.

జాన్వీ ఆరెంజ్ టాప్.. బ్లూ డెనిమ్ షార్ట్ లో కిర్రాక్ లుక్ లో క‌నిపిస్తుంటే.. ఇషాన్ చాలా సింపుల్ గా షార్ట్ - టీస్ లో క‌నిపించాడు. ఈ జంట చాలా క్యాజువ‌ల్ గా అలా డిన్న‌ర్ డేట్ కి క‌లిశార‌ని అర్థ‌మ‌వుతోంది. అన్న‌ట్టు డేటింగ్ లో లేరు .. కేవ‌లం స్నేహం మాత్ర‌మేన‌ని భావించాలి ఇప్ప‌టికి.