Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : శ్రీదేవిని గుర్తుకు తెస్తోందే..

By:  Tupaki Desk   |   3 May 2018 12:27 PM GMT
ఫోటో స్టోరీ : శ్రీదేవిని గుర్తుకు తెస్తోందే..
X
శ్రీదేవికి అతిలోక సుందరి అనే పేరు ఊరికే స్థిరపడిపోలేదు. ఆమెది అనితర సాధ్యమైన అందం. ఆ విషయంలో ఆమెను మ్యాచ్ చేసేవాళ్లు అరుదుగా కనిపిస్తారు. శ్రీదేవికి ముందు.. శ్రీదేవి తర్వాత ఆమెకు సాటి వచ్చే వాళ్లు అరుదుగా కనిపిస్తారు. అలాంటి సౌందర్య రాశి కడుపున పుట్టింది జాన్వి కపూర్. ఐతే ఈ అమ్మాయి అందం విషయంలో ఓ మోస్తరుగా అనిపించింది తప్ప ఏనాడూ తల్లికి తగ్గ తనయురాలనిపించలేదు. శ్రీదేవితో పోల్చడానికి ఎప్పడూ పెద్దగా అవకాశం లేకపోయింది. పైగా శ్రీదేవి లుక్.. ఈమె లుక్ ఎప్పుడూ పూర్తి భిన్నంగా ఉండేవి. శ్రీదేవి ఎప్పుడూ ట్రెడిషనల్ లుక్స్ లో దర్శనమిస్తే.. జాన్వి మోడర్న్ లుక్స్ తో ఈ ట్రెండుకు తగ్గట్లుగా కనిపించేది. అందుకే ఇద్దరి మధ్య పోలికే ఉండేది కాదు. ఐతే తాజాగా జాన్వి తన తల్లిని తలపించేలా తయారవడం విశేషం.

అచ్చం తల్లిలాగే మేకప్ వేసుకుని.. చీర కట్టుకుని ముచ్చటగొలిపేలా రెడీ అయి ఒక ఫొటో షూట్ చేసింది జాన్వి. ఆమె లుక్స్ శ్రీదేవినే తలపిస్తున్నాయి ఇందులో. సడెన్ గా చూస్తే శ్రీదేవి గుర్తుకు వచ్చేలా ఉంది. బహుశా తల్లి చనిపోయిన నేపథ్యంలో ఆమెకు ట్రిబ్యూట్ గా జాన్వి ఇలా తయారైందేమో. ఈ లుక్ శ్రీదేవి అభిమానుల్ని అలరిస్తోంది. తల్లి మరణం నుంచి కొంచెం కొంచెం కోలుకుని ఈ మధ్యే రెగ్యులర్ లైఫ్ లోకి వస్తోంది జాన్వి. ఆమె కథానాయికగా పరిచయం కానున్న ‘ధడక్’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ చిత్రం జూన్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరాఠీలో విజయవంతమైన ‘సైరాట్’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే.