Begin typing your search above and press return to search.

జాన్వీ క‌పూర్ అభిమానించేది ఆ ఇద్ద‌రినేనా?

By:  Tupaki Desk   |   3 Aug 2022 1:30 AM GMT
జాన్వీ క‌పూర్ అభిమానించేది ఆ ఇద్ద‌రినేనా?
X
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో స‌త్తా చాటుతుంది. ఓ వైపు హీరోయిన్ గా న‌టిస్తూనే..మ‌రోవైపు లేడీ ఓ రియేంటెడ్ చిత్రాల‌పైనా దృష్టి పెడుతుంది. జాన్వీ ఈ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణాన్ని ఎంతో బ్యాలెన్సింగ్ గా ముందుకు తీసుకెళ్తుంది. ఇటీవ‌లే సౌత్ సినిమాల‌పై కూడా మ‌క్కువ‌ని వెల్ల‌డించింది.

అమ్మ‌డి మాట‌ల్ని బ‌ట్టి సౌత్ లో ఎంట్రీ ఏ క్ష‌ణ‌మైనా జ‌ర‌గ‌డానికి ఆస్కార ఉంద‌ని తెలుస్తుంది. మామ్ శ్రీదేవి త‌ర‌హాలోనే అన్ని భాష‌ల్ని దున్నేసే ప్లాన్ క‌నిపిస్తుంది. త‌న‌తో పాటు కొంత మంది న‌వ నాయిక‌లు ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ జాన్వీ ప్ర‌త్యేక‌మని ఇప్ప‌టికే ప్రూవ్ చేసింది. నాటి-మేటి నాయిక‌ల‌తోనూ ఎంతో చ‌నువుగా మెలుగుతుంది. వాళ్లతోనూ మంచి ప్రెండ్ షిప్ ని కొనసాగిస్తుంది.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో జాన్వీ ముందుకు కొన్ని ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు వెళ్లాయి. అమీర్ ఖాన్..షారుక్ ఖాన్.. స‌ల్మాన్ ఖాన్ ల‌తో క‌లిసి తెర‌ను పంచుకోవాల‌ని ఉందా? అని అడ‌గ‌గా...త‌ప్ప‌కుండా కానీ వాళ్ల స‌ర‌స‌న న‌టించ‌డం అన్న‌ది అస‌హ‌జంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్లంతా ఎంతో సీనియ‌ర్స్ . ఎన్నో సినిమాలు చేసిన అనుభ‌వం. వ‌య‌సు ప‌రంగా చాలా వ్య‌త్యాసం ఉంటుంది.

కానీ వాళ్ల‌తో క‌లిసి న‌టించాల్సిన రోల్ కుదిరితే క‌చ్చితంగా న‌టిస్తాను. ప్ర‌తీ సినియ‌ర్ తో క‌లిసి ప‌నిచేయ‌డం అదృష్టంగా భావిస్తాను. వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన విష‌యాలు చాలానే ఉన్నాయి.

అలాంటి అవ‌కాశం ఎవ‌రు వ‌దులుకుంటారు అంది. బాలీవుడ్ లో ఈ స్టార్ హీరోల‌తో మామ్ శ్రీదేవి ప‌లు సినిమాలు చేసింది. అప్ప‌ట్లో ఆ స్టార్స్ తో శ్రీదేవి కెమిస్ర్టీ ఎంతో అద్భుతం అని చెప్పాలి. ఆ కాంబినేష‌న్స్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన సంద‌ర్భాలు 80-90వ ద‌శ‌కంలో ఉన్నాయి.

ఇక తెర‌పై ఏ న‌టీన‌టులు అందంగా క‌నిపిస్తారు? అని ప్ర‌శ్నిస్తే.. ర‌ణ‌బీర్ క‌పూర్..వ‌రుణ్ ధావ‌న్ పేర్లు చెప్పింది. వాళ్ల‌తోనూ క‌లిసి ప‌నిచేయాలి అన్న ఆస‌క్తిని కన‌బ‌రిచింది. అయితే నేటిత‌రం న‌టుల్లో త‌న‌లో స్పూర్తిని నింపింది మాత్రం అలాయాభ‌ట్ అంటుంది. అలియాభ‌ట్ న‌ట‌నంటే ఎంతో ఇష్ట‌మ‌ని..త‌ను సినిమాల్లోకి రావ‌డానికి మ‌రో కార‌ణంగా అలియా భ‌ట్ ని ఉద్దేశించింది.