Begin typing your search above and press return to search.
జూనియర్ శ్రీదేవిని వదలని ట్రోలర్లు!
By: Tupaki Desk | 23 Jan 2019 6:31 AM GMTపిల్లి కళ్ళుమూసుకుని పాలుతాగుతూ నన్నెవ్వరూ చూడడం లేదని అనుకుంటుందట. అలానే కాపీ కొట్టేవాళ్ళు మమ్మల్ని ఎవరు కనుక్కుంటారులే అని అనుకుంటారు. కాపీలలో పీహెచ్ డీలు చేసిన ముదుర్లలో అయితే 'ఒకవేళ కనుక్కున్నా ఏం పీకుతారులే' అనే భావన కూడా ఉంటుంది. కానీ ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ఏ కాపీ దాగదు. మీరు కాపీ కొట్టేలోపే కొందరు నెటిజనులు ఆ కాపీకి ఒరిజినల్ ను చూపిస్తారు.
ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జాన్వి రీసెంట్ గా కాస్మోపాలిటన్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజిపై తళుక్కున మెరిసింది. 'తళుక్కున' అంటే ఏదో మాటవరసకు కాదు.. నిజంగానే తారలు తళుక్కున మెరిసినట్టే. హోలోగ్రఫిక్ ఎఫెక్ట్ ఉండే పర్పుల్ కలర్ డ్రస్ లో తళతళలాడింది. నిజం ఒప్పుకోవాలి కదా.. డ్రెస్సుతో పాటు ఆమె స్టైల్ కూడా అదరహో. కానీ ఇది కాపీ అని కొందరు ఫ్యాషన్ ప్రియులు చిటికెలో కనిపెట్టి జాన్వి ని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.
జాన్వీ వేసుకున్న డ్రెస్ ఇంటర్నేషనల్ గా పాపులర్ అయిన ఫ్రెంచ్ బ్రాండ్ పర్పుల్ ప్రయిస్ వారి బాల్మెయిన్ ఫాల్ 2018 కలెక్షన్ లో హోలోగ్రఫిక్ ఎఫెక్ట్ ఉండే డ్రెస్ ను మక్కికిమక్కి దించేసినదే. జాన్వి తన డ్రెస్ డిజైనర్ సూచించినట్టు ఆ డ్రెస్ వేసుకొని ఉండొచ్చు.. ఆ డ్రెస్ వేసుకోవడం లో తన తప్పేమీ లేకపోయి ఉండొచ్చు కానీ ట్రోలర్లకు అవేమీ పట్టవు కదా. ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే నెటిజనులు వెంటనే తలంటేస్తారు!