Begin typing your search above and press return to search.

ప్ర‌శాంత‌మైన మాల్దీవుల్లో కుర్ర‌బ్యూటీ అల‌జ‌డులు

By:  Tupaki Desk   |   11 April 2021 10:30 AM GMT
ప్ర‌శాంత‌మైన మాల్దీవుల్లో కుర్ర‌బ్యూటీ అల‌జ‌డులు
X
టూపీస్ లు బికినీల‌తో చెల‌రేగిపోవ‌డంలో న‌ట‌వార‌సురాళ్ల‌ను కొట్టేవాళ్లే లేరు. ఆ సంగ‌తి బాలీవుడ్ లో ఇటీవ‌ల తెర‌కు ప‌రిచ‌య‌మైన.. ఇప్ప‌టికే ప‌రిచ‌యం కాబోతున్న భామ‌ల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇక ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను సినిమాల్లో న‌టించేసిన జాన్వీ క‌పూర్ బికినీల స్పెష‌లిస్ట్ గా ఓ వెలుగు వెలుగుతోంది. నిరంత‌ర‌ ట్రీట్ లో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గేదే లేదంటోంది.

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ మాల్దీవుల విహారం హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌శాంతమైన మాల్దీవుల్లో జాన్వీ కపూర్ ఫోటోషూట్లు అగ్గి రాజేస్తున్నాయి. నిన్న‌టితో విహారం ముగించుకుని తిరిగి ముంబైకి చేరుకున్న జాన్వీ త‌న సెల‌బ్రేషన్స్ నుంచి స‌రికొత్త ఫోటోల్ని షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి.

జాన్వీ స‌‌ముద్ర‌యానంలో ఫోటోషూట్ ఇది. వైట్ టాప్.. ప‌సుపు బాట‌మ్ టూపీస్ లో జాన్వీ ఎంతో స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. ఇంత‌కుముందు జాన్వీ షేర్ చేసిన ఫ్లోర‌ల్ బికినీ.. నీలి రంగు బికినీల‌తో పోలిస్తే ఇది డిఫ‌రెంట్. ఇది టూపీస్ బికినీ త‌ర‌హా. జాన్వీ హాలీడేస్ డైరీలో అన్నీ వెరైటీ బికినీలదే హవా. బికినీల్లో మెటాలిక్ మోనోకినిలు .. అందమైన మినీ పూల దుస్తులు ఈ ట్రిప్ లో హైలైట్ గా నిలిచాయి. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇటీవ‌ల నెట్ ఫ్లిక్స్ ఘోస్ట్ స్టోరీస్ లో జాన్వీ న‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి దోస్తానా 2 రిలీజ్ కి రావాల్సి ఉండ‌గా.. గుడ్ లక్ జెర్రీ సెట్స్ పై ఉంది.