Begin typing your search above and press return to search.

ర‌హస్య ప్రియుడితో జాన్వీ?

By:  Tupaki Desk   |   10 Dec 2022 11:30 AM GMT
ర‌హస్య ప్రియుడితో జాన్వీ?
X
అనుష్క శ‌ర్మ‌.. దీపిక‌.. క‌త్రిన .. ఆలియా.. త‌మ ప్రియుల విషయంలో ప్ర‌తిదీ ర‌హ‌స్యంగా దాచాల‌నుకున్నా ఏదీ దాగ‌లేదు. సుదీర్ఘ ప్రేమాయ‌ణాల‌తో బాలీవుడ్ మీడియాలో నిరంత‌రం హాట్ టాపిక్ గా మారేవారు. చివ‌రికి త‌మ ప్రేమికుల‌ను కొంగున క‌ట్టేసుకుని గ‌డుస‌రి భామ‌లు అనిపించారు. ప్ర‌స్తుతం పెళ్లిలోని మ‌జాను సంసారబంధ‌నంలో స‌రాగాల్ని ఆస్వాధిస్తున్నారు.

మునుముందు ఈ జాబితాలో కియ‌రా అద్వాణీ కూడా చేర‌బోతోంది. ప్రియుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రాని సాధ్య‌మైనంత తొంద‌ర‌లోనే పెళ్లాడేందుకు కియ‌రా సిద్ధంగా ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అదంతా స‌రే కానీ ఇప్ప‌టివ‌ర‌కూ డేటింగుల ప‌రంగా ఎలాంటి గాసిప్స్ లో లేని జాన్వీ క‌పూర్ పేరు కూడా ఇప్పుడు జాబితాలోకి వ‌చ్చేసింది.

త‌న స్నేహితురాళ్లు సారా అలీఖాన్- అన‌న్య పాండే వ‌రుస ఎఫైర్లు సాగిస్తున్నా జాన్వీ క‌పూర్ హీరోల‌తో అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం తెలిసిందే. అప్పుడ‌ప్పుడు దేవ‌ర‌కొండ లాంటి హీరోల‌పై క‌వ్వింపుగా మాట్లాడుతూ ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ ని పెంచుకునే ప‌ని త‌ప్ప డేటింగ్ వ‌ర‌కూ వ్య‌వ‌హారం వెళ్ల‌లేదు. అయితే త‌న స్కూల్ కాలేజ్ స్నేహితుల‌తో చ‌నువుగా ఉండ‌డం మాత్రం కొన్నిసార్లు బ‌య‌ట‌ప‌డింది. కానీ ప‌బ్లు క్ల‌బ్బు ల్లో స్నేహాల‌ను ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

కానీ ఇప్పుడు మాజీ ప్రియుడు శిఖర్ పహారియా అంటూ పాత పేరును కొత్త‌గా తెర‌పైకి తెచ్చింది బాలీవుడ్ మీడియా. అత‌డితో కలిసి జాన్వీ క‌పూర్ మాల్దీవుల్లో విహారయాత్రను ఆస్వాధిస్తోంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. అంతేకాదు దీనికి అభిమానులు తాజా ఫోటో ప్రూఫ్ ని కూడా చూపెడుతున్నారు. శిఖ‌ర్ ప‌హారియా జాన్వీకి చాలా క్లోజ్ ఫ్రెండ్. స్కూల్ డేస్ నుంచి స్నేహితులు. కానీ ఆ ఇద్ద‌రి బంధంపైనా పుకార్లు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో శిఖర్ పహారియా మూన్ లైట్ చిత్రాన్ని అనేక మంది నెటిజ‌నులు అర్థం చేసుకున్నారు. జాన్వీ కపూర్ శిఖర్ పహారియాతో కలిసి మాల్దీవుల్లో తన వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోందని అభిమానులు గ్రహించారు.

జాన్వీ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో మూన్ లైట్ కింద అద్భుతమైన ఫోటోల‌ను షేర్ చేయ‌గా.. ఈ ఫోటోలలో వైట్ అండ్ వైట్ కటౌట్ లుక్ లో క‌నిపించింది. ఇంత‌లోనే ఒక నెటిజ‌న్ తన ఇన్ స్టాలో ఆమె మాజీ శిఖర్ పహారియా పోస్ట్ చేసిన చంద్రకాంతి ఫోటోని షేర్ చేసాడు. ``కాబట్టి జాన్వీ & వీర్ పహారియా మాల్దీవులలో కలిసి గడుపుతున్నారు`` అని స‌ద‌రు అభిమాని దీనికి క్యాప్ష‌న్ ఇచ్చాడు.

జాన్వీ కూచుని ఉన్న చోట‌ బ్యాక్ డ్రాప్ లో సముద్రం క‌నిపిస్తోంది. అలాగే బ్యాక్ లెస్ లుక్ ని ఆవిష్క‌రించే ఫోటో ఇది. ఇన్ స్టాలో ఈ ఫోటోల‌ను షేర్ చేస్తూ.. హాఫ్ మూన్ ఎమోజీని షేర్ చేసింది. ``లేలేత చంద్రకాంతిలో నన్ను కలవండి`` అంటూ సగం పసుపు చంద్రుని ఎమోజీని షేర్ చేసింది. ఈ ఫోటోలపై స్పందిస్తూ జాన్వీ మాజీ ప్రియుడు శిఖర్ పహారియా ``మూన్ స్పిరిట్ (రెడ్ హార్ట్ ఎమోజి)`` అని రాశారు. కొంత‌కాలంగా జాన్వీ మాల్దీవుల విహారం నుంచి వ‌రుస‌గా కొన్ని లీకులు అందిస్తోంది. గజిబిజి జుట్టు.. ఇరిడెసెంట్ స్కైస్... లవణం గాలులు అంతులేని సముద్రం.. అంటూ క‌విత్వం చెబుతూ కొన్ని ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి.

శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. అతను గతంలో జాన్వీ కపూర్ తో డేటింగ్ చేసాడని క‌థ‌నాలొచ్చాయి. అయితే అత‌డు ఆ తరువాత జాన్వీ నుంచి విడిపోయాడు. కరణ్ జోహార్ తన చాట్ షో.. కాఫీ విత్ కరణ్ 7 లో వారి డేటింగ్ పుకార్లను దాదాపుగా ధృవీకరించారు. జాన్వీ ఇటీవల ముంబైలో శిఖర్ తో షికార్లు చేస్తూ కెమెరా కంటికి చిక్కిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు నేరుగా మాల్దీవుల విహారంలో ఈ కొత్త జంట లీకులివ్వ‌డం అభిమానుల్లో ఉత్సుక‌త‌ను పెంచుతోంది. దాగుడు మూత‌ల దండాకోర్ ఆట‌ను స‌మ‌ర్థంగా ర‌క్తి క‌ట్టించే భామ‌ల్లో జాన్వీ పేరు ఇప్పుడు క‌న్ఫామ్ గా చేరిపోయింది.

ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. జాన్వీకి ఇప్పటివరకు 2022 సంవత్సరం కెరీర్ ప‌రంగా ఎంతో క‌లిసి వ‌చ్చింద‌ని చెప్పాలి. గుడ్ లక్ జెర్రీ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. జూలైలో డిస్నీ+ హాట్ స్టార్ లో విడుదలైన ఈ చిత్రంలో జాన్వీ ప్రధాన పాత్రను పోషించింది. సిద్ధార్థ్ సేన్ గుప్తా దీనిని తెర‌కెక్కించారు. గత నెలలో థియేటర్లలో విడుదలైన మిలీలో ఉత్త‌మ న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఆమె తండ్రి బోనీ కపూర్ నిర్మించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ లోను ప్రధాన పాత్రను పోషించింది.

త‌దుప‌రి వరుణ్ ధావన్ తో కలిసి `బవాల్` లో కనిపించనుంది. ఈ చిత్రం 2023లో విడుదల కానుంది. రాజ్ కుమార్ రావుతో కలిసి `మిస్టర్ అండ్ మిసెస్ మహి` కూడా సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ క్రికెటర్ పాత్రలో కనిపించనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.