Begin typing your search above and press return to search.

జాన్వీ మళ్లీ మంట పుట్టించిందిగా

By:  Tupaki Desk   |   3 Feb 2023 9:00 AM GMT
జాన్వీ మళ్లీ మంట పుట్టించిందిగా
X
అలనాటి అందాలతార శ్రీదేవి కుమార్తెగా వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్‌. సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది ఈ అమ్మడు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. అలా నేటింట్లో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ.. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ నెట్టింట అడుగుపెడితే ఆ రోజంతా దుమారమే. వరుస ఫొటోషూట్లతో గ్లామర్ విందు చేస్తుంటుంది. ఈమె ఫొటోలకు కుర్రాళ్ల మతులు పోతుంటాయి. రోజురోజుకు సరికొత్త అవతారంలో దర్శనమిస్తూ నెట్టింట రచ్చరచ్చ చేస్తూ ఉంటుంది.

ఇక విషయానికొస్తే హెల్తీ లైఫ్‌స్టైల్‌ కోసం సినిమా స్టార్లంతా జిమ్ తో పాటు యోగా చేస్తుంటారు. జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు ఇస్తూ.. యోగాను కచ్చితంగా ఫాలో అవుతుంటారు. దీనికి జాన్వీ కపూర్‌ కూడా మినహాయింపు కాదు. తరచూ తన వర్కౌట్‌ రొటీన్‌లను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటుంది. ఫిట్నెస్ విషయంలో అస్సలు ఏమాత్రం తగ్గదు. అలా పొట్టి జిమ్ వేర్ లో మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది.

తాజాగా మరో కొత్త వీడియోను పోస్ట్ చేసింది. ఇందులోనూ ఆమె పొట్టి వేర్ లో కసరత్తులు చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. ఇది చూసిన నేటిజెన్లు, అభిమానులు వర్కౌట్ అదిరింది, ఫిట్నెస్ గోల్ సూపర్, వెరీ హాట్ బేబీ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఇక జాన్వీ సినిమాల విషయానికొస్తే.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. కానీ జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఇంతవరకు ఖరారు కాలేదు. అసలు జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవికి మొదట క్రేజ్ వచ్చింది తెలుగు చిత్రాలతోనే. ఆ తర్వాత శ్రీదేవి బాలీవుడ్ లో కూడా సూపర్ స్టార్ గా ఎదిగింది. ఇకపోతే రీసెంట్ గా మిలీ చిత్రంతో అలరించిన ఈ ముద్దుగమ్మ.. త్వరలోనే మిస్టర్ అండ్ మిస్ మహి, బవాల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించనుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.