Begin typing your search above and press return to search.

జాన్వీ జాత‌ర ఆగేట్టు లేదు బాబోయ్

By:  Tupaki Desk   |   6 March 2022 12:30 PM GMT
జాన్వీ జాత‌ర ఆగేట్టు లేదు బాబోయ్
X
న‌ట‌వార‌సురాలి జాత‌ర ఆగేట్టు లేదు బాబోయ్ .. ! ఇటీవ‌లి కాలంలో నెట్టింట విరుచుకుప‌డుతున్న జాన్వీ క‌పూర్ ని చూడ‌గానే అభిమానుల ఫీలింగ్ ఇదీ. రోజు అయినా గ్యాప్ లేకుండా గంట గంట‌కో ఫోటోషూట్ తో విరుచుకుప‌డుతోంది ఈ బ్యూటీ ఇప్ప‌టికే జాన్వీ ఫోటోషూట్లు కుప్ప‌లుతిప్ప‌లుగా వెబ్ ని ముంచెత్తాయి. ఇందులో వేడెక్కించే ప‌రువాల విందుకు కొద‌వేమీ లేదు. ఇప్పుడు ఇదే కేట‌గిరీలో మ‌రో ఫోటోషూట్ తో చెల‌రేగింది జాన్వీ.

తాజా ఫోటోషూట్ ఎంతో క‌ళాత్మ‌కంగా భ‌న్సాలీని సైతం ఆక‌ర్షించేదిగా క‌నిపిస్తోంది. ఇక ఇటీవ‌లే ఆలియా భ‌ట్ గంగూభాయి క‌థియావాడీగా మెప్పించింది. త‌దుప‌రి జాన్వీలాంటి బ్యూటీకి కూడా భ‌న్సాలీ నుంచి ఆఫ‌ర్ ఉంద‌న్న టాక్ ఉంది. అందుకే ఇలా కాస్త క‌ళాత్మ‌క‌మైన ఫోజుల‌తో క‌నిపించిందేమో అన్న డౌట్లు పుట్టించేస్తోంది.

హ‌ద్దులు చెరిపేసిన స్పైసీ ఊంప్ ఫ్యాక్ట‌ర్ లుక్ లో క‌నిపిస్తున్నా కానీ అందులోనూ క‌ళాత్మ‌క‌త‌ను ప్ర‌ద‌ర్శించింది జాన్వీ. ఇటీవ‌ల అన్నీ స్పోర్ట్స్ బ‌యోపిక్ ల‌లో న‌టిస్తోంది. అందుకు భిన్న‌మైన ఇమేజ్ త‌న‌కు కావాల‌ని అనుకుంటోంది. త‌న‌కు వేశ్య త‌ర‌హా పాత్ర‌లు ఇచ్చినా బోల్డ్ గా డీగ్లామ‌ర్ గా లేదా అందాల ఆర‌బోత‌తో విరుచుకుప‌డేలా ఏవైనా కొత్త కొత్త పాత్ర‌లు కావాల‌నుకుంటోంది.

అందుకే జాన్వీలో వైవిధ్యాన్ని ఇలా తెర‌ప‌రిచేస్తోంది అంటూ అభిమానులు భావిస్తున్నారు. పైనుంచి మామ్ శ్రీ‌దేవి అన్నిటినీ చూస్తోంది. స్టార్ కిడ్ ఆశీస్సులు అందుకుంటూ త‌న ప‌నిలో తాను ఉంది మ‌రి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే..జాన్వీ కపూర్ న‌టిస్తున్న తాజా చిత్రం `మిస్టర్ & మిసెస్ మహి` సంచ‌ల‌నాలు ఖాయ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ మూవీలో జాన్వీ క్రికెట‌ర్ గా న‌టిస్తోంది. ఇందు కోసం దినేష్ కార్తీక్ సార‌థ్యంలో క్రికెట్ క్యాంప్ లో శిక్షణ పొందుతోంది. ఈ చిత్రం క్రికెట్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. మూవీ గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో జాన్వీ రూహి సహనటుడు రాజ్ కుమార్ రావ్ కూడా నటిస్తున్నారు.

ఇంత‌కుముందు రిపబ్లిక్ డే 2022 (జనవరి 26) నాడు జాన్వీ తన ఇన్ స్టాలో క్రికెటర్‌గా నటించే అవ‌కాశం రావ‌డంపై ఆనందం వ్య‌క్తం చేసింది. ఆ లుక్ లో క్రికెట్ హెల్మెట్ ను ధరించి జాన్వీ కనిపించారు. వెటరన్ ఇండియన్ వికెట్ కీపర్-బ్యాట్స్ మ‌న్ దినేష్ కార్తీక్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాన్ని కూడా ఆమె షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యింది.

మిస్టర్ అండ్ మిసెస్ మహిలో జాన్వీ - రాజ్‌కుమార్ వరుసగా మహేంద్ర అలాగే మహిమ అనే పాత్రలను పోషించనున్నారు. శరణ్ శర్మతో జాన్వీకి ఇది రెండో ప్రాజెక్ట్. జాన్వీ కపూర్ టైటిల్ రోల్ లో నటించిన 2020 చిత్రం ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ శ‌ర‌ణ్ కి దర్శకుడిగా రెండో సినిమా. భారతదేశంలో క్రికెట్ కు విపరీతమైన ఆదరణ ఉన్నందున ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడుతుంది అన్న‌ది ఆసక్తిని పెంచుతోంది.