Begin typing your search above and press return to search.
7 డిగ్రీల చలిలో జూనియర్ శ్రీదేవి
By: Tupaki Desk | 6 Aug 2019 6:51 AM GMTస్వర్గానికేగిన అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా అడుగు పెట్టిన జాన్వీ కపూర్ మొదటి సినిమా ధడ్కన్ మరీ ఇండస్ట్రీ హిట్ కాకపోయినా కమర్షియల్ గా సేఫ్ అయిపోయి మంచి డెబ్యూగా నిలిచింది. తన తర్వాతి ప్రాజెక్ట్స్ లోనూ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్న ఈ భామ ప్రస్తుతం నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తోంది. కెరీర్లో అతి తక్కువ టైంలోనే ఓ ఛాలెంజింగ్ బయోపిక్ లో నటించే అవకాశం రావడం అంటే మాటలా.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న కార్గిల్ గర్ల్ లో జాన్వీ టైటిల్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం దీని కీలక షెడ్యూల్ జార్జియాలోని ఓ మంచు ప్రదేశంలో జరుగుతోంది. అక్కడ వాతావరణం ఎంతో తెలుసా. కేవలం 7 డిగ్రీలు. ఇక్కడ ఏసీలో 16 డిగ్రీలు పెడితేనే గజగజ వణికిపోయే మనకు ఇక ఏడు డిగ్రీలు అంటే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. తానున్న స్థితిని చెబుతూ జాన్వీ ఇన్స్ టాలో పోస్ట్ చేయడం వైరల్ గా మారుతోంది
ఇటీవలే లక్నో షెడ్యూల్ పూర్తి చేసుకున్న కార్గిల్ గర్ల్ షూట్ లో పాల్గొనేందుకు పంకజ్ త్రిపాఠితో అంగద్ బేడీ తదితరులు జార్జియా బయలుదేరి వెళ్లారు. అక్కడ ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ అండ్ వార్ ఎపిసోడ్స్ తీయబోతున్నట్టు తెలిసింది. 22 ఏళ్ళ సుకుమారమైన వయసులోనే ఇలాంటి పాత్రలను ఎంచుకున్నందుకు నెటిజెన్లు ఆమె మీద అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
అన్నట్టు ఈ కార్గిల్ గర్ల్ కోసమే జాన్వీ కపూర్ 6 కేజీల బరువు పెంచుకుందట. తన మరో సినిమా రూహ్ ఆఫ్జా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న భారీ మల్టీ స్టారర్ తక్త్ లోనూ నటిస్తున్న జాన్వీ కపూర్ కెరీర్ బాలీవుడ్ లోనే ఇంత దివ్యంగా ఉంటే ఇక తెలుగు సినిమాలకు వచ్చేదెప్పుడో