Begin typing your search above and press return to search.
జిమ్ము డ్రెస్సుల అతిలోక సుందరి 2.0
By: Tupaki Desk | 5 Jun 2019 10:01 AM GMTస్టార్ హీరోయిన్లలో చాలామంది అందంగానే ఉంటారు కానీ ప్రతిఒక్కరికి ఒక యూఎస్పీ ఉంటుంది. కార్పోరేట్ భాషలో విరివిగా వాడే ఈ పదానికి ఫుల్ ఫామ్.. యునీక్ సెల్లింగ్ పాయింట్. అలా చూసుకుంటే క్వీన్ కంగనాకు యూఎస్పీ నోరు. ఆ నోటికి భయపడి మహామహులైన బాలీవుడ్ సెలబ్రిటీలు అన్నీ మూసుకొని కూర్చుంటున్నారు. ఇక కత్రినా కైఫ్ ను తీసుకుంటే లాంగ్ లెగ్స్. జాన్వి విషయానికి వస్తే మరోరకం.. ఆమె జిమ్ము డ్రెస్ వేసిందంటే చాలు ముంబై మొత్తం స్థంభించిపోతుంది.
ఆమె జిమ్ములో కఠినమైన కసరత్తులు చేస్తోందో లేదో దేవుడెరుగు.. జిమ్ముకెళ్ళే సమయంలో వేసుకునే దుస్తులను ఎంపిక చేసుకునేందుకు మాత్రం తీవ్రమైన కసరత్తే చేస్తున్నట్టు మాత్రం మనం గట్టిగా ఫిక్స్ అయిపోవచ్చు. అందుకేనేమో రీసెంట్ గా కత్రినా ఒక టాక్ షోలో మాట్లాడుతూ జాన్వి వేసుకునే ఆ చిట్టి పొట్టి జిమ్ము డ్రెస్సులను చూస్తే తనకు ఆందోళనగా ఉంటుందని తెలిపింది. ఇక అంతకంటే చిన్న మైక్రోలు.. మినీలు ఎవరూ వేసుకోరు..ఒకవేళ వేసుకున్నా జాన్వి కనిపించినంత అందంగా.. స్టైలిష్ గా ఉండరు.
తాజాగా మరోసారి జిమ్ డ్రెస్ తో అందరినీ క్లీన్ బౌల్డ్ చేసింది జాన్వి. పొట్టి షర్టు కావడంతో నాభి అందాలు.. పొట్టి నిక్కర్ కావడంతో కాళ్ళ అందాలు బైటపడ్డాయి. లైట్ పర్పుల్ కలర్ టీ షర్టు.. బ్లూ మైక్రో నిక్కర్ వేసుకొని..ఒక ఎల్లో కలర్ బ్యాగ్ ను భుజానికి తగిలించుకుని వయ్యారంగా కారు దిగి నడుచుకుంటూ వెళ్ళింది. ఈ ప్రాసెస్ అంతా ఎంతో ఆకర్షణీయంగా నవ్వుతూ.. ముంబై పేపరాజీకి చేతులు ఊపుతూ ఒక ఫ్యాషన్ ఐకాన్ లాగా జిమ్ములోకి నడుచుకుంటూ వెళ్ళింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా? ఇక సినిమాల విషయానికి వస్తే జాన్వి ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ 'కార్గిల్ గర్ల్' లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'తఖ్త్' లో కూడా జాన్వి హీరోయిన్. 'రుహ్ అఫ్జా' అనే మరో హారర్ కామెడీలో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.