Begin typing your search above and press return to search.
జాన్వీకి ఇష్టమైనది ప్రత్యేకమైనది
By: Tupaki Desk | 8 Aug 2020 8:10 AM GMTఅతిలోక సుందరి ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు అవ్వడంతో దేశ వ్యాప్తంగా సినీ జనాలకు జాన్వీ కపూర్ ఈజీగా రీచ్ అయ్యింది. బాలీవుడ్ లో వరుసగా చిత్రాలు చేస్తున్న ఆమె త్వరలో సౌత్ లో కూడా ఎంట్రీ ఇస్తుందనే నమ్మకంతో ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా తన అమ్మను గుర్తు తెచ్చుకుంటూ పోస్ట్ లు పెడుతూనే ఉంటుంది. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా ఈ ఫొటో షేర్ చేసి మరోసారి జాన్వీ కపూర్ కాస్త ఎమోషనల్ అయ్యింది.
జాన్వీ ఇన్ స్టాగ్రామ్ లో... నేడు జాతీయ చేనేత దినోత్సవం. ఇది నాకు ఎంతో ఇష్టమైన చాలా ప్రత్యేకమైన చేనేత చీర. ఇలాంటి అద్బుతమైన సృజనాత్మకత కలిగిన చీర ప్రపంచంలో ఎక్కడ కూడా లభించదు. ఈ చీర కట్టుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మ మొదటి సారి నాకు కట్టిన చీర అంటూ జాన్వీ ఎమోషన్ అయ్యింది. నేడు ఈ పోస్ట్ పెట్టడం ద్వారా చేనేత వస్త్రాలను ప్రమోట్ చేసినట్లయ్యింది. ఇండియాలో చేనేతన్న కోసం ఏర్పాటు చేసిన ఈ రోజున తక్కువ మంది సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. అందులో జాన్వీ కపూర్ ఒకరు. చేనేత చీరలపై ఈమె చేసిన వ్యాఖ్యలు తప్పకుండా చేనేతన్నల కు ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చుతాయంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.