Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అల్ట్రా మోడ్ర‌న్ అతిలోక సుంద‌రి

By:  Tupaki Desk   |   1 Jun 2021 5:30 PM GMT
ఫోటో స్టోరి: అల్ట్రా మోడ్ర‌న్ అతిలోక సుంద‌రి
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి నాటి రోజుల్లో ఫ్యాష‌నిస్టాగా యువ‌త‌రం గుండెల్ని దోచారు. ఇండ‌స్ట్రీకి ట్రెండీ డిజైన్స్ ని స్టైలింగ్ ని ప‌రిచ‌యం చేయ‌డంలో శ్రీ‌దేవికి అరుదైన రికార్డ్ ఉంది. ఇక త‌న‌కు మోడ్ర‌న్ ఔట్ ఫిట్స్ అయినా చీర అయినా ఎంతో అందంగా కుదిరేవి. ఇప్పుడు ఆ వార‌స‌త్వాన్ని కొన‌సాగించ‌డంలో ఒక మెట్టు పైనే ఉన్నాన‌ని నిరూపిస్తున్నారు జాన్వీ క‌పూర్. నేటిత‌రంలో ఠ‌ఫ్ కాంపిటీట‌ర్ గా దూసుకెళుతోంది జాన్వీ.

తాజాగా జాన్వీ ఎల్లే ఇండియా జూన్ సంచిక ముఖచిత్రంగా క‌నిపించారు. తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన అంద‌మైన‌ లెహెంగా సెట్లో జాన్వీ ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించింది - లెహెంగా .. గోల్డెన్ టాప్ ఎంబ్రాయిడ‌రీ తో ఈ లుక్ ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపిస్తోంది. తరుణ్ తహిలియాని రూపొందించిన‌ గోల్డ్ చోకర్ ధ‌రించి డిజైన‌ర్ లుక్ పిక్చ‌ర్ ప‌ర్ఫెక్ట్ గా క‌నిపిస్తోంది. ఇక ఈ లుక్ చూడ‌గానే జాన్వీ అల్ట్రా మోడ్ర‌న్ అతిలోక సుంద‌రినే త‌ల‌పిస్తోంది! అంటూ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మాల్దీవుల విహారంలో ఎంతో స్పెష‌ల్ లుక్ తో అల‌రించిన జాన్వీ ఈసారి కూడా దుమారం రేపే అల్ట్రా స్టైలిష్ లుక్ తో ఆక‌ట్టుకుంటోంది.

ఎల్లే ఇండియాతో మాట్లాడుగూ.. జాన్వి కపూర్ ఈ మహమ్మారి సమయంలో భార‌త‌దేశ పరిస్థితి గురించి చర్చించారు. ఆమె మాట్లాడుతూ- ``ప్రస్తుతం దేశంలో చాలా పెయిన్ .. నిస్సహాయత .. బాధలు ఉన్నాయని తెలిసి నిద్రపోవడం కష్టం. నాలాంటి వారు చేయగలిగేది చుట్టుపక్కల ఉన్న‌ ప్రజలకు సహాయం చేయడమే`` అని అన్నారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. జాన్వి కపూర్ తదుపరి గుడ్ లక్ జెర్రీ -దోస్తానా 2 చిత్రాల్లో కనిపించనున్నారు.