Begin typing your search above and press return to search.
రెడ్ హాట్ డ్రెస్ లో జాన్వీ జిగేల్ జిగేల్
By: Tupaki Desk | 17 Aug 2021 12:30 PM GMTస్టార్ డాటర్ జాన్వీ కపూర్ కెరీర్ పరంగా ఎదురే లేని లైనప్ తో ముందుకు సాగుతున్న సంగతి తెలిసినదే. త్వరలోనే టాలీవుడ్ లోనూ అడుగుపెట్టనుందని కథనాలొస్తున్నాయి. మహేష్ .. చరణ్.. బన్ని లాంటి స్టార్లు జాన్వీని తెలుగు తెరపైకి తెచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని కథనాలొచ్చాయి.
ఇకపోతే జాన్వీ తన స్టార్ డమ్ ని సౌత్ కి విస్తరించే దిశగా తెలివైన చర్యలతో ముందుకు సాగుతోంది. ఇక జాన్వీ సోషల్ మీడియాల్లో హాటెస్ట్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హాట్ హాట్ ఫోటోలతో ఇన్ స్టాలో రచ్చ చేయడం జాన్వీ స్పెషలిస్ట్. జిమో..యోగా వీడియోల్లోనూ అంతే హాట్ గా ఎలివేట్ అవుతుంది. తనదైన అందం.. థై సొగసులతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపడం జాన్వీ ప్రత్యేకత. రేర్ గా ట్రెడిషనల్ లుక్స్ లోనూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఎరుపు వర్ణం డిజైనర్ వేర్ లో జాన్వీ మిరుమిట్లు గొలిపే లుక్ తో ఆకట్టుకుంది. ఎరుపు రంగు..దానికి మ్యాచింగ్ కలర్ దుస్తుల్లో ధగధగలాడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జాన్వీ ధగధగల అందాలపై కామెంట్లు హీటెక్కిస్తున్నాయి.
ఇక అమ్మడు విషయాలకి వస్తే ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ నటిగా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. `ధడక్` సినిమాతో ఎంట్రీ జాన్వీ అటుపై ఊహించని క్రేజ్ ని సొంతం చేసుకుంది. దీంతో కరణ్ జోహార్ వరుసగా ధర్మ ప్రొడక్షన్స్ లో నే సినిమాలు చేసేలా ఒప్పందం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆదే బ్యానర్ లో దోస్తానా-2లో నటిస్తోంది. అదిగాక మరో రెండు సినిమాలు కూడా అదే బ్యానర్లో సంతకాలు చేసింది. కరణ్ కొన్నాళ్ల పాటు అమ్మడిని బయటి బ్యానర్లో సినిమాలు చేయకుండా తన బ్యానర్ లోనే లాక్ చేస్తుండటం విశేషం.
ప్రస్తుతం ఆయన డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి `లైగర్` సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూరి ద్వారానే జాన్వీని టాలీవుడ్ లో కి దించాలా? అన్న ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఓ వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. మరి ఇందులో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.