Begin typing your search above and press return to search.
ఈ విషయంలో జాన్వీని ఎంత పొగిడినా తక్కువే
By: Tupaki Desk | 26 Dec 2021 10:36 AM GMTసెలబ్రెటీల డ్రస్సింగ్ ఈమద్య కాలంలో చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో సెలబ్రెటీలు షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు కొన్ని విమర్శల పాలు అవుతున్నాయి. చాలా మంది హీరోయిన్స్ శృతి మించిన ఎక్స్ పోజింగ్ తో అందాల ను ఆరబోస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొన్నారు. వారి వ్యక్తిగత విషయం అది అయినా కూడా కొందరు మాత్రం తప్పు పట్టకుండా ఉండలేక పోతున్నారు. వారి ప్రవర్తన విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు కాని వారి డ్రస్సింగ్ విషయంలో పద్దతి మార్చుకోవాలంటూ చాలా మంది చాలా రకాల కామెంట్ చేయడం జరిగింది. ఈ విమర్శలు గతంలో పలు సార్లు జాన్వీ కపూర్ కూడా ఎదుర్కొంది. శ్రీదేవి వంటి లెజెండ్రీ స్టార్ హీరోయిన్ కూతురు అయిన జాన్వీ కపూర్ డ్రస్సింగ్ విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తుంది అంటూ చాలా సందర్భాల్లో నెటిజన్స్ విమర్శించారు.
ఇతర హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఆమె అందాల ఆరబోత ఉంది. ఒకానొక సమయంలో అందరిని మించి అన్నట్లుగా ఈ అమ్మడి ఫొటో షూట్ లు ఉన్నాయి. జాన్వీ కపూర్ ఎంతగా ఎక్స్ పోజ్ చేసినా కూడా సందర్బానుసారంగా తన పద్దతిని ప్రదర్శిస్తూ శ్రీదేవి కూతురు అనిపించుకుంటుందని మరోసారి నిరూపితం అయ్యింది. ఏదైనా సినిమా వేడుకలకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా అందాల ప్రదర్శణ చేసేలా డ్రస్సింగ్ ఉంటుంది. కాని కొందరు దేవాలయానికి వెళ్లిన సమయంలో కూడా పద్దతైన డ్రస్ ను వేసుకోకుండా విమర్శల పాలవుతారు. కాని జాన్వీ కపూర్ మాత్రం ఆ విషయంలో ఎప్పుడు కూడా హద్దు దాటలేదు. ఆమె ఈ విషయంలో ఎప్పుడు కూడా తప్పు చేయలేదు.
తాజాగా తిరుపతి వచ్చిన జాన్వీ కపూర్ మరోసారి తన మార్క్ ను చూపించింది. రెగ్యులర్ గా తిరుపతి శ్రీవారి ని దర్శించుకునేందుకు వచ్చే జాన్వీ కపూర్ వచ్చిన ప్రతి సారి కూడా అందంగా పద్దతైన తెలుగు అమ్మాయిగా లంగా ఓనీ లేదా చీర అది కాదంటే పద్దతైన చుడిదార్ ను మాత్రమే ధరిస్తుంది. జాన్వీ కపూర్ ఈసారి పింక్ ఓనీ తో పాటు గోల్డ్ కలర్ లంగా మరియు బ్లౌజ్ లో మెప్పించింది. పక్కింటి అమ్మాయి అన్నంతగా ఫీల్ ను కలిగించింది. జాన్వీ కపూర్ ను ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిందే. టీవీ సెలబ్రెటీలు కూడా ఈమద్య కాలంలో దేవాలయానికి వెళ్లిన సమయంలో తమ సెలబ్రిటీ స్టేటస్ ను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాని జాన్వీ మాత్రం చాలా సింపుల్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. త్వరలో తెలుగు లో ఒక సినిమాను ఈమె చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.