Begin typing your search above and press return to search.
జాన్వీ.. వర్షం కాదు వడగల్లు కురిపిస్తోంది!
By: Tupaki Desk | 19 Jun 2022 2:30 AM GMTబాలీవుడ్ హాట్ గాళ్ జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం గుడ్ లక్ జెర్రీ జూలై 29న OTT లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా `గుడ్ లక్ జెర్రీ` కొత్త పోస్టర్ లను జాన్వీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెండు థీమ్ పోస్టర్లను రిలీజ్ చేయగా మొదటి పోస్టర్ లో జాన్వీ కపూర్ చేతిలో తుపాకీ పట్టుకుని కెమెరా వైపు చూస్తూ కనిపించింది.
రెండవ పోస్టర్ లో జాన్వీ అమాయకంగా కెమెరాలోకి చూస్తున్నట్లుగా కనిపించింది. ``నేను కొత్త సాహసం ఆరంభించాను. నాకు లక్ చిక్కాలని కోరుకోలేదా?`` అంటూ తన సినిమాకి ప్రచారం హోరెత్తిస్తోంది. గుడ్ లక్ జెర్రీ జూలై 29 నుండి డిస్నీ+హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది.
పంజాబ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జాన్వీ నటన హైలైట్ గా ఉండనుందని సమాచారం. ప్రముఖ నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించారు. పంకజ్ మట్టా ఈ చిత్రానికి కథను అందించారు. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్- మితా వశిష్ట్- నీరజ్ సూద్ - సుశాంత్ సింగ్ తదితరులు నటించారు.
ఇక ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ వరుస ఫోటోషూట్లలో పాల్గొంటోంది. ఇంతకుముందే బ్లూ థై స్లిట్ లుక్ లో జాన్వీ ఫోజులు గుబులు రేపాయి. బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ డిజైనర్ డ్రెస్ లో జాన్వీ హొయలు మైండ్ బ్లాక్ చేశాయి. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. జాన్వీ కిల్లర్ లుక్ కి యూత్ ఫిదా అవుతోంది. షి బ్రింగ్స్ ది రెయిన్! అన్న క్యాప్షన్ ని కూడా ఇచ్చింది. దీనికి స్పందిస్తూ.. జాన్వీ వర్షం కాదు వడగల్లు కురిపిస్తోంది! అంటూ కామెంట్లు పడిపోతున్నాయ్.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... జాన్వీ కపూర్ వరుసగా విలక్షణ కథల్ని ఎంపిక చేసుకుని వైవిధ్యమైన సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. గుడ్ లక్ జెర్రీ తర్వాత లైనప్ లో రొమాంటిక్ కామెడీ `దోస్తానా 2` ఉంది. ఈ మూవీ నుంచి కార్తీక్ ఆర్యన్ వైదొలిగిన అనంతరం చిత్రీకరణకు సంబంధించిన అప్ డేట్ ని వెల్లడించలేదు. వరుణ్ ధావన్ తో కలిసి జాన్వీ మిలీ లో నటించింది.
ఈ చిత్రానికి 2019లో అసలు మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన మాతుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సన్నీ కౌశల్ -మనోజ్ పహ్వా కూడా నటించారు. జాన్వీ తండ్రి బోనీ కపూర్ ఈ మూవీ నిర్మాతల్లో ఒకరు కాగా.. ఇందులో బోనీ తన గారాల కుమార్తెతో కలిసి నటించడం విశేషం. ఇదే కాకుండా రాజ్ కుమార్ రావుతో `మిస్టర్ అండ్ మిసెస్ మహి` చిత్రంలోనూ జాన్వీ నటిస్తోంది. ఈ మూవీ కూడా విడుదలకు రానుంది. అలాగే బవాల్ అనే మరో చిత్రంలోనూ జాన్వీ నటిస్తోంది.