Begin typing your search above and press return to search.
మొన్నే కదా లంగా వోణీలో కనిపించింది ఇంతలోనే..!
By: Tupaki Desk | 6 Sep 2022 3:30 AM GMTమొన్నే కదా తిరుమలేశుని సన్నిధానంలో ఎంతో సింపుల్ గా సాంప్రదాయ చీరకట్టులో కనిపించింది. ఇంతలోనే ఇలా రూపం మార్చేసింది ఊసరవెల్లిలా. సందర్భానుసారం ఎంపికల్లో జాన్వీని కొట్టేవాళ్లే లేరు!
గుడికి బడికి వెళ్లినప్పుడు లేదా ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరైనప్పుడు ఎలా కనిపించాలి? అన్నదానిలో సెలబ్రిటీ గాళ్స్ ఎంతో సెలక్టివ్ గానే ఉంటారు. జూనియర్ అతిలోక సుందరి జాన్వీ ఎప్పటికప్పుడు సందర్భానుసారం డ్రెస్సింగ్ సెన్స్ తో మెప్పిస్తోంది. మొన్నటికి మొన్న
బ్లూ శారీలో ఒళ్లంతా బంగారు ఆభరణాలతో లక్ష్మీ దేవినే తలపించింది. తిరుమలేశుని దర్శనం అనంతరం ఆరుబయట అందరి దృష్టిని తనవైపు తిప్పేసుకుంది.
తాజాగా జాన్వీ సోషల్ మీడియాలో డెనిమ్ షార్ట్ లో హాటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ``రద్దు చేశాం`` అంటూ టీజింగ్ క్యాప్షన్ ని కూడా ఇచ్చింది జాన్వీ. ఈ భామ డెనిమ్ షార్ట్ తో పాటు తెల్లటి క్రాప్ టాప్ ధరించి కనిపించింది. ఫోటోలను పోస్ట్ చేసిన వెంటనే అభిమానులు స్నేహితులు వ్యాఖ్యలతో దుమారం రేపారు. జాన్వీ స్నేహితుడు ఓర్హాన్ అవత్రామణి కూడా ఒక కామెంట్ చేసారు. అతడు ``ఎలా ..`` అని సింపుల్ గా ప్రశ్నించాడు. నెటిజనులలో ఒకరు డామన్ క్యూట్.. ఎవరూ మిమ్మల్ని క్యూట్ నెస్ లో ఓడించలేరు.. అంటూ పొగిడేశాడు. మొత్తానికి జాన్వీ లుక్ ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల జాన్వి తన స్నేహితురాలు సారా అలీ ఖాన్ తో ఒక వీడియో కోసం కలిసి పనిచేసింది. డిస్నీ+ హాట్ స్టార్ లో హెచ్.బి.ఓ సిరీస్ `హౌస్ ఆఫ్ ది డ్రాగన్` ప్రీమియర్ కోసం యాడ్ షూట్ ఇది. జాన్వీ నటించిన ఇతర సినిమాలు తదుపరి విడుదల క్యూలో ఉన్న సంగతి తెలిసిందే.
కపూర్ గాళ్ ఇటీవల `గుడ్ లక్ జెర్రీ`లో నటించింది. తదుపరి `మిలీ` విడుదలకు రానుంది. `మిస్టర్ అండ్ మిసెస్ మహి` లోను నటిస్తోంది. అలాగే జూనియర్ భాయ్ గా పాపులరైన వరుణ్ ధావన్ `బవాల్` లోను నటిస్తోంది. త్వరలోనే టాలీవుడ్ లోనూ ఈ భామ ఎంట్రీ ఇవ్వనుంది. తారక్ సరసన నటింపజేసేందుకు జాన్వీతో కొరటాల సంప్రదింపులు చేస్తున్నారని కూడా టాక్ వినిపించింది. అయితే దీనిపై అధికారికంగా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.