Begin typing your search above and press return to search.

`బొంబాయి` సీక్వెల్ గా `క‌రోనా` తీస్తే ఈవిడే హీరోయినా?

By:  Tupaki Desk   |   25 Sep 2020 2:30 AM GMT
`బొంబాయి` సీక్వెల్ గా `క‌రోనా` తీస్తే ఈవిడే హీరోయినా?
X
“కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే.. నీ క‌ళ్ల‌లో ప‌లికిన‌వి నా కంటి భాష‌లివి. అందాల వ‌య‌సేదో తెలుసా మారి.. విర‌బూస వ‌ల‌పేదొ నాలో.. నీ పేరు నా పేరు తెలుసా మ‌రి.. హృద‌యాల క‌థ మారె నీలో”... రెహ్మాన్ పాటల్లో అంద‌రికీ ఇష్టమైన ఈ పాట `బొంబాయి` చిత్రంలోనిది. రెహ‌మాన్ క్లాసిక్ మ్యూజిక్ అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మే. ఇది వేటూరి రాసిన గొప్ప పాటల్లో ఒకటి. ఇక ఈ మూవీలో ముస్లిమ్ యువ‌తిగా న‌టించిన మ‌నీషా కొయిరాలాకు ముస్లిమ్ యువ‌తిని ప్రేమించే యువ‌కుడిగా అర‌వింద స్వామి న‌ట‌న‌కు రీప్లేస్ మెంట్ అన్న‌దే లేదు. మ‌త‌క‌ల్లోలాల నేప‌థ్యంలో హిందూ ముస్లిమ్ ప్రేమ‌క‌థను మ‌హ‌దాద్భుతంగా తెర‌కెక్కించి సంచ‌ల‌నం సృష్టించారు మ‌ణిర‌త్నం.

ఆ సినిమా ఇమేజ్ ఎప్ప‌టికీ మ‌ణి స‌ర్ కి గౌర‌వం పెంచుతూనే ఉంటుంది. ఆయ‌న కెరీర్ లో హిట్టు అన్న‌దే లేక‌పోయినా ఇప్ప‌టికీ ద‌ర్శ‌క‌మ‌ణిగా గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు? అంటే.. ఇదిగో ఇక్క‌డ జాన్వీ క‌పూర్ కి డిజైన్ చేసిన ఆ లెహంగా అంత ప‌ని చేసింది. ఇంత‌కీ ఎవ‌రు ఈ డిజైన్ చేసింది? అంటే ప్ర‌ఖ్యాత డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా.

త‌ల మీదుగా భుజాల్ని క‌ప్పేస్తూ క‌నిపిస్తున్న ఆ పాక్షిక వ‌స్త్రం జాన్వీ అందాన్ని దాయ‌లేక‌పోతోంది. ఎంత‌గా దాచేద్దామంటే అంత‌గా హైలైట్ అవుతోంది. ఇక ఈ కాస్ట్యూమ్ కి అద్దిన భారీ ఆభ‌ర‌ణాలు ప్ర‌త్యేక అలంకారంగా మారాయి. ఒక‌వేళ మ‌ణి స‌ర్ .. బొంబాయి సీక్వెల్ లాంటిదేదైనా తీస్తే గ‌నుక జాన్వీకే ఛాన్సివ్వాలి. ఇప్పుడు మ‌త‌క‌ల్లోలాలు ఏవీ లేవు కానీ.. ముంబైలో క‌రోనా మార‌ణ‌కాండ సాగుతోంది. క‌రోనా క‌ష్టాల్లో ప్రేమ క‌థ‌లేవైనా పుట్టిస్తే జాన్వీ అందులో న‌టిస్తే దానికి మ‌ణి స‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తే అది సంచ‌ల‌న‌మే అవుతుందేమో!