Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: క‌పూర్ గాళ్ మెరుపులు మిరుమిట్లు

By:  Tupaki Desk   |   19 May 2021 5:30 AM GMT
ఫోటో స్టోరి: క‌పూర్ గాళ్ మెరుపులు  మిరుమిట్లు
X
బాలీవుడ్ లో ట్రెండీ ఫ్యాష‌నిస్టాగా జాన్వీ క‌పూర్ పేరు మార్మోగుతున్న సంగ‌తి తెలిసిందే. నిరంత‌రం ఏదో ఒక ఇన్నోవేష‌న్ కోసం త‌పించే యువ‌నాయిక‌గా జాన్వీ కి యూత్ లో ప్ర‌త్యేకించి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఈ భామ ఎవ్వ‌ర్ లేటెస్ట్ ట్రెండ్స్ ని ఫ్యాన్స్ కి ప‌రిచ‌యం చేస్తోంది.

ఇంత‌కుముందు మాల్దీవుల విహారం నుంచి వేడెక్కించే హాట్ బికినీల‌తో చెల‌రేగిన జాన్వీ.. ఆ త‌ర్వాతా ఓ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై అగ్గి రాజేసే లుక్ తో క‌నిపించింది. రీసెంట్ గా రిలీజైన హార‌ర్ థ్రిల్ల‌ర్ `రూహీ`లో ప‌ర్పుల్ డిజైన్ లుక్ తో స్పెష‌ల్ నంబ‌ర్ లో స్క్రీన్ పైనా ఫైర్ రాజేసింది.

తాజాగా మ‌రో హాట్ ఫోటోషూట్ ని జాన్వీ ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. మిరుమిట్లు గొలిపే క్రిస్ట‌లైన్ డిజైన‌ర్ లుక్ ఇది. డార్క్ గ్రీన్ క‌ల‌ర్ లో ప్ర‌త్యేకించి జాన్వీ కోసం రూపొందించిన లుక్ ఇది. ఇక ఇదే ఫోటోషూట్ లో పింక్ .. రెడ్ క‌ల‌ర్ డిజైన‌ర్ లుక్ లోనూ మెరిసిపోయింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. జాన్వి ఇప్పుడు దోస్తానా 2 లో న‌టిస్తోంది. లక్ష్య - గుడ్ లక్ జెర్రీ చిత్రాల్లోనూ కనిపించనున్నారు. గుడ్ లక్ జెర్రీ కి సిద్ధార్థ్ సేన్ గుప్తా ద‌ర్శ‌కుడు. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్నారు.