Begin typing your search above and press return to search.
హాయ్ గర్మీ కో బాయ్ గర్మీ! గోవా ట్రిప్ లో జాన్వీ చిలౌట్!!
By: Tupaki Desk | 16 April 2021 9:30 AM GMTజీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాధించాలి. కష్టనష్టాల్లో ఎదురీదాలి. అప్పుడే జీవితానికి సాంత్వన. మామ్ శ్రీదేవి మరణానంతరం జాన్వీ కపూర్ కంబ్యాక్ అయిన తీరుకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. తన తల్లి తాను నటించిన తొలి చిత్రం చూడకుండానే ఇహలోకం నుంచి అంతర్థానం అయ్యారు. ఆ వేదన జాన్వీలో ఎప్పటికీ అలానే ఉంది.
కానీ అన్నిటినీ అధిగమించి ప్రతి సందర్భాన్ని ఎలా సంతోషంగా గడపాలో జాన్వీ స్ఫూర్తివంతమైన జర్నీ చెబుతోంది. సోషల్ మీడియాల్లో నిరంతరం ఫోటోషూట్లను షేర్ చేసే జాన్వీ ఈ వేసవిపైనా తనదైన శైలిలో ఫన్నీగా సెటైరికల్ గా స్పందిస్తున్నారు. తాజాగా గోవా నుంచి ఓ స్పెషల్ ఫోటోని షేర్ చేసి దానికి హాయ్ గర్మీ కో బాయ్ గర్మీ! అంటూ వ్యాఖ్యను ట్యాగ్ చేశారు. దానికి ఒక వైపు కుక్క ఈమోజీ.. మరోవైపు స్నోమాన్ ఈమోజీని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో అభిమానుల్లో వైరల్ గా మారింది.
ఇక జాన్వీ ఇటీవలే మాల్దీవుల విహారాన్ని ముగించి ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి గోవా ట్రిప్ ప్లాన్ చేశారట. కానీ ముంబై నగరంలో జనతా కర్ఫ్యూ అమల్లోకి రావడంతో కొంత ఇబ్బంది పడిందట. కోవిడ్ కేసులు పెరగడం వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం నగరంలో షూటింగులు నిలిపివేసి 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించింది.
ప్రస్తుతం గోవాలో ఉన్న జాన్వి తన సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ ల్ని షేర్ చేస్తున్నారు. తన రోజువారీ కార్యకలాపాల గురించి తన అభిమానులకు అప్ డేట్స్ ను పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వేసవి తాపాన్ని తాను ఎలా ఎదుర్కొంటోందో జాన్వీ వివరిస్తున్నారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఘోస్ట్ స్టోరీస్ లో జాన్వీ నటించిన సంగతి తెలిసిందే. తదుపరి దోస్తానా 2 రిలీజ్ కి రావాల్సి ఉండగా.. గుడ్ లక్ జెర్రీ సెట్స్ పై ఉంది.