Begin typing your search above and press return to search.
పదహారేళ్ల వయసు శ్రీదేవిని తలపిస్తోంది!
By: Tupaki Desk | 25 April 2021 2:30 PM GMTపదహారేళ్ల వయసు.. తెలుగు చిత్రసీమలో శ్రీదేవిని తారగా నిలిపిన చిత్రమిది. 1978 ఆగస్టు 31 న విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకొంది. అందాల మల్లిగా శ్రీదేవి.. అమాయకుడైన చంద్రంగా చంద్రమోహన్ .. పల్లెటూరి పోకిరిగా మోహన్ బాబు నటించారు. తెలుగు వెర్షన్ కి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మాతృక పదునారు వయనదిలే అనే తమిళ చిత్రం. అక్కడ భారతీరాజా దర్శకత్వం వహించారు. అక్కడ కూడా నాయిక శ్రీదేవే. అమాయకుడిగా కమల్ హాసన్.. పోకిరిగా రజనీకాంత్ నటించారు.
ఈ సినిమా వెనుక ఒక తమాషా సంఘటన ఉంది. ఈ చిత్రానికి ఎస్.ఎ.రాజకన్ను నిర్మాత. ఈయన ఒక సొంత లారీ ఉన్న డ్రైవర్. సినిమా పిచ్చి. కొంత సొమ్ము సంపాదించాక భారతీరాజాను కలిసి సినిమా తీస్తాను అంటే ఈ కథ చెప్పారు. 4.5 లక్షల రూపాయల్లో పూర్తవుతుందని చెప్పారు. సినిమా మొదలయ్యాక 1.5 లక్షలు బడ్జెట్ పెరిగింది. అందుకోసం లారీ, కొన్ని వస్తువులు కూడా అమ్మేశాడు రాజకన్ను. ఆరు ప్రింట్లతో తమిళనాడులో విడుదలైంది. ఓ మాదిరి చిత్రం అన్నారు. నాలుగు వారాల తరువాత ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఎక్కడచూసినా ఇళయరాజా బాణీలు.. శ్రీదేవి-కమల్-రజనీ ల నటన గురించే చర్చ. పూర్తి చేసేందుకు లారీ అమ్ముకున్న రాజకన్ను ఆదాయపు పన్ను వారి నుంచీ రీమేక్ ల కోసం వస్తున్న ఒత్తిళ్ళ నుంచి తప్పించుకొనేందుకు దాక్కోవలసి వచ్చింది. విశ్రాంతి కోసం మైలాపూర్ లోని దేవకీ ఆస్పత్రిలో చేరిపోయారు. ఆ ఆచూకీ తెలుసుకొని తెలుగు నిర్మాత మిద్దే రామారావు అక్కడికి వెళ్ళి 1.25 లక్షల రూపాయలిచ్చి రీమేక్ హక్కులు పొందారు. అప్పట్లో రీమేక్ హక్కులకు 40 వేల రూపాయలకు మించి ఇచ్చేవారు కాదు.
మిద్దే రామారావుతో అంగర సత్యం.. అంగర లక్ష్మణ రావు కలిసి తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడిగా రాఘవేంద్రరావు అయితేనే దీనికి న్యాయం చేస్తాడని నిర్మాతలు భావించారు. అప్పటికే ఆయన అడవి రాముడు విజయంతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు. రీమేక్ ని ఒప్పుకుంటాడా లేదా అన్న సందేహంతో నిర్మాతలు ఆయన్ను సంప్రదించారు. అప్పటికీ తమిళ చిత్రం చూసిన ఆయన సినిమా పై ఆసక్తి చూపించి చేశారు. శ్రీదేవినే నాయికగా తీసుకున్నారు. ఆమె 50000 రూపాయలు పారితోషికం అడిగితే 35000 రూపాయలు ఇచ్చారు నిర్మాతలు. చంద్రమోహన్ కి 17000 మోహన్ బాబుకి 10000 రూపాయల పారితోషికం ఇచ్చారు.
ఇదంతా ఇప్పుడే ఎందుకు గుర్తు చేయాలి? అంటే.. శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ ధడక్ తో తెరంగేట్రం సమయంలో కొన్ని విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. శ్రీదేవిని గుర్తు చేయడం లేదని కొందరు విమర్శించారు. అయితే కాలక్రమంలో అది మారుతోంది. ప్రతిభతో జాన్వీ ఆకట్టుకుంటోంది. తాజాగా కొత్త మ్యాగజైన్ ఫోటోషూట్ రూపం కాస్త మామ్ పోలికలను గుర్తు చేస్తోంది. ప్రఖ్యాత ఖుష్ వెడ్డింగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై జాన్వీ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఇది జాన్వీ కపూర్ వెడ్డింగ్ లుక్ అభిమానుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. పదహారేళ్ల వయసు శ్రీదేవి రూపం కనిపిస్తోంది గురూ! అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. అయితే శ్రీదేవి ఆ చిత్రంలో పూర్తిగా పల్లెటూరి యువతిగా కనిపిస్తుంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం కెరీర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటిస్తోంది. తదుపరి పల్లెటూరి అమ్మాయి పాత్రలతోనూ అభిమానుల్ని అలరిస్తారా లేదా చూడాలి. జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తీసి కె.రాఘవేంద్రరావు లేదా ఇంకెవరైనా దర్శకుడు జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేస్తారేమో చూడాలి.