Begin typing your search above and press return to search.

నీ ఒళ్లు బంగారం కానూ! జాన్వీ వాటే లుక్!!

By:  Tupaki Desk   |   14 Dec 2021 9:32 AM GMT
నీ ఒళ్లు బంగారం కానూ!  జాన్వీ వాటే లుక్!!
X
నీ ఇల్లు బంగారం గాను… నా ఒళ్ళు సింగారం గాను
జోరుమీద ఉన్నావు జోడు కడతావా
మోజుమీద సన్నజాజి పూలు పెడతావా,.. హా హా హా

నీ ఇల్లు బంగారంగాను… నా ఒళ్ళు సింగారంగాను
పొంగుమీద ఉన్నావు తోడు పెడతావా
మురిపాల మీగడంత తోడి పెడతావా,.. హా హా హా
నీ ఇల్లు బంగారంగాను… నా ఒళ్ళు సింగారంగాను.......!!

ఎన్టీఆర్ గ‌జ‌దొంగ (1981) చిత్రంలోనిది ఈ లిరిక్. వేటూరి సుంద‌ర‌రామ మూర్తి సాహిత్యం అందించ‌గా చ‌క్ర‌వ‌ర్తి.కె సంగీతం అందించారు. గాన‌గంధ‌ర్వుడు ఎస్పీబాలు - జాన‌కి ఆల‌పించారు. ఈ క్లాసిక్ సాంగ్ ని ఇప్పుడే ఎందుక‌ని త‌ల‌వాలి? అంటే.. ఇదిగో ఇక్క‌డ జాన్వీ రూపం అలా ఓల్డ్ క్లాసిక్ ని నెమ‌రు వేసుకునేందుకు కార‌ణ‌మైంది.

త‌ళ‌త‌ళా బంగారు వ‌ర్ణంతో మెరిసిపోతున్న జాన్వీ క‌పూర్ న‌యా లుక్ యూత్ లోకి దూసుకుపోయింది. ఇటీవ‌ల వ‌రుస‌గా బికినీల‌తో షేక్ చేసిన జాన్వీ ఇప్పుడిలా ప్ర‌యోగాత్మ‌క లుక్ తోనూ మెరిపిస్తోంది. గోల్డ్ క‌ల‌ర్ డిజైన‌ర్ టాప్ బాట‌మ్ తో అద‌ర‌గొట్టింది. జాన్వీలో హాట్ కంటెంట్ ని ఈ డిజైన్ స‌రికొత్త‌గా ఆవిష్క‌రించింద‌ని చెప్పాలి. దోస్తానా 2 .. గుడ్ ల‌క్ జెర్రీ స‌హా ప‌లు చిత్రాల్లో జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. ఇవ‌న్నీ మునుముందు విడుద‌ల‌కు సిద్ధం కావాల్సి ఉంది.