Begin typing your search above and press return to search.
జాన్వీ.. వైరల్ వార్తల్లో నిజమెంత?
By: Tupaki Desk | 29 Nov 2022 3:01 PM GMTఅతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఆరంగేట్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా జూ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల తెరకెక్కించనున్న సినిమా కోసం జాన్వీని సంప్రదించారని కథనాలొచ్చాయి. అయితే దానిని జాన్వీ ఖండించింది. ఎన్టీఆర్ లేదా చరణ్ లాంటి ట్యాలెంటెడ్ హీరోల సరసన నటించమని తనని ఎవరూ సంప్రదించలేదని కూడా తెలిపింది. తెలుగు అగ్రహీరోల సరసన అవకాశం వస్తే ఏమాత్రం ఆలోచించనని కూడా హింట్ ఇచ్చింది.
అదే క్రమంలో జాన్వీ ఆరంగేట్రానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని గుసగుసలు వినిపించాయి. కొరటాల ఇప్పటికీ జాన్వీకి గాలం వేసి లాగుతున్నాడని తారక్ సరసన నటింపజేస్తాడని గుసగుసలు ఇంకా అలానే ఉన్నాయి. కానీ దీనిపై ఇంకా స్పష్ఠత రాలేదు. ఇంతలోనే చరణ్ తో ఉప్పెన దర్శకుడు తెరకెక్కించే సినిమాలో నటింపజేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తాజాగా గుసగుసలు వేడెక్కిస్తున్నాయి. నిజానికి తారక్ కి షెడ్యూల్స్ అనుకూలించకపోవడంతో అదే కథతో బుచ్చిబాబు సనా చరణ్ ని సంప్రదించి ఒప్పించారని టాక్ వినిపించింది. అప్పట్లో తారక్ సరసన జాన్వీని ఒప్పించే ఆలోచన చేశారని కూడా కథనాలొచ్చాయి. కానీ ఇప్పుడు అదే కథలో హీరో మారాడు. కానీ హీరోయిన్ గా జాన్వీనే మరోసారి బుచ్చిబాబు సంప్రదించనున్నారని గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.
అయితే చరణ్ సరసన జాన్వీ ఎంపిక సరైనది కాదని ఒక సెక్షన్ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేయగా జాన్వీకి ఇదే సరైన డెబ్యూ అవకాశం అని మద్ధతు పలికేవారు లేకపోలేదు. నిజానికి ధడక్ సినిమాతో జాన్వీ బాలీవుడ్ లో ఆరంగేట్రం చేసినప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ జాన్వీ భారీ పారితోషికం డిమాండ్ చేస్తోంది. ఈ అమ్మడికి దేశవ్యాప్తంగా యువతరంలో ఫాలోయింగ్ ఏర్పడింది. నటిగా శ్రీదేవి తనయ నిరూపించుకుని కెరీర్ పరంగా తెలివైన ప్లానింగ్ తో ముందుకు సాగుతోంది. జాన్వీ కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ ను కలిగి ఉంది. నిరంతర ఫోటోషూట్లతో అగ్గి రాజేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తోంది.
అంతేకాదు... భవిష్యత్ లో దక్షిణాదినా పెద్ద స్టార్ కావాలని జాన్వీ కలలు కంటోంది. ఇప్పటికే అందుకు బోనీ పాపా వైపు నుంచి కావాల్సినంత సపోర్ట్ ఉంది. కానీ మంచి స్క్రిప్టు సరైన స్టార్ హీరోతో అవకాశం కోసమే వేచి చూస్తున్నారు. కానీ ఇప్పటివరకూ అనుకున్న అవకాశం జాన్వీకి దక్కలేదు. ఇప్పుడు తారక్ లేదా చరణ్ సరసన జాన్వీ టాలీవుడ్ లో ఆరంగేట్రం చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తారక్- కొరటాల సినిమా లేదా చరణ్-బుచ్చిబాబు సినిమా ఈ రెండిటిలో దేనిలో నటించే అవకాశం దక్కించుకుంటుందో వేచి చూడాలి.
స్పోర్ట్స్ డ్రామా ఇంట్రెస్టింగ్
రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్ లో స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ 2023లో ప్రారంభం కానుంది. ఇందులో ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని బరిలో దించడం ద్వారా పాన్ ఇండియా అప్పీల్ తేవాలన్న ప్లాన్ అయితే ఉంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. జాన్వీ కపూర్ పేరు ప్రచారంలోకి రావడానికి కారణం తనకు ఉన్న ఫాలోయింగే. ఈ యంగ్ బ్యూటీకి ధీటుగా సారా అలీఖాన్ .. అనన్య పాండే లాంటి నాయికలకు ఛాయిస్ ఉండే అవకాశం లేకపోలేదు.
ఇటీవల చరణ్ కేవలం అగ్ర హీరోయిన్లకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ లో ఆలియా.. ఆర్.సి 15లో కియరా అద్వాణీలకు ఛాన్స్ దక్కింది. తదుపరి బుచ్చిబాబుతో జాన్వీ కపూర్ కి అవకాశం ఇస్తాడా లేదా? అన్నది వేచి చూడాలి. ఇక బడ్జెట్ అదుపులో ఉండాలంటే పాన్ ఇండియా అప్పీల్ ఉన్న యువనాయికను మాత్రమే బుచ్చిబాబు ఎంపిక చేస్తాడా? లేక బాలీవుడ్ నుంచి ఇంకా ఎవరైనా స్టార్ హీరోయిన్ కావాలని అడుగుతాడా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే ఆర్.సి 16 సెట్స్ పైకి వెళ్లనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.