Begin typing your search above and press return to search.
మనసు భారంగా ఉన్నా నవ్వుతూనే ఉంటా : జాన్వీ
By: Tupaki Desk | 24 Feb 2019 11:37 AM GMTశ్రీదేవి మృతి చెంది సంవత్సరం అయ్యింది. ఆమె జ్ఞాపకాలు ఇంకా కూడా ఆమె అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. అభిమానులే ఆమెను మర్చి పోలేక పోతున్నారు. అలాంటిది ఆమె కుటుంబ సభ్యులు మరెంతగా ఆవేదన వ్యక్తం చెందుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తీవ్ర ఆవేదనతో ఉంది. హీరోయిన్ గా తనను చూడాలని కోరుకున్న అమ్మ ఇప్పుడు పక్కన లేకపోవడంతో జాన్వీ కపూర్ ప్రతి నిమిషం కూడా భారమైన మనసుతోనే ఉంటుందట.
అతిలోక సుందరి శ్రీదేవి మరణించి సంవత్సరం అయిన సందర్బంగా జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. నా మనసు ఎప్పుడు కూడా భారంగానే ఉంటుంది. అయితే నేను ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాను, ఎందుకంటే నా నవ్వులో నువ్వు ఉన్నావు. అందుకే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను అంటూ తల్లి తన చేతులను పట్టుకున్న పిక్ ను పోస్ట్ చేసింది. జాన్వీ కపూర్ పోస్ట్ చాలా ఆవేదన కనిపించింది. శ్రీదేవి అభిమానులు పెద్ద ఎత్తున జాన్వీ కపూర్ పోస్ట్ కు స్పందిస్తున్నారు.