Begin typing your search above and press return to search.

100 కోట్లు పెట్టి రెండు డూప్లెక్సులు కొన్న న‌టి!

By:  Tupaki Desk   |   4 Nov 2022 7:30 AM GMT
100 కోట్లు పెట్టి రెండు డూప్లెక్సులు కొన్న న‌టి!
X
కోటి సంపాద‌న .. సామాన్యుడు ఊహించ‌లేనిది. కోట్లు సంపాదించాలనేది మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఆలోచ‌న.. అది ఒక అంద‌మైన‌ క‌ల‌. కానీ ఇవ‌న్నీ పాజిబులేనా? భారీగా వ్యాపారాలు చేసే ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కొంత‌వ‌ర‌కూ డ‌బ్బు వేట‌లో స‌క్సెసైనా కానీ మ‌ధ్య త‌ర‌గ‌తి ఎప్ప‌టికీ ఎదుగూబొదుగూ లేకుండా ఉండ‌డ‌మే జ‌గ‌మెరిగిన‌ స‌త్యం. కానీ సినీరంగంలో క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేసిన ప్ర‌ముఖ యువ‌న‌టి కేవ‌లం నాలుగైదేళ్ల‌లోనే భారీ ఆర్జ‌న‌తో సంచ‌లనంగా మారుతోంది. ఏడాదిలోనే 100 కోట్ల‌తో రెండు డూప్లెక్స్ అపార్ట్ మెంట్లు కొనుక్కుంది అంటే ఊహించండి. అయితే ఇందులో కొంత త‌న తండ్రి గారి సంపాద‌న కూడా ఉంది లెండి. ఇదంతా ఎవ‌రి గురించి అంటే.. తండ్రి కూతుళ్లు జాన్వీ క‌పూర్ - బోనీక‌పూర్ గురించే.

జాన్వీ కెరీర్ లో ఒక్కో మెట్టు తీర్చిదిద్దుతూ బోనీ క‌పూర్ కోట్లాది రూపాయ‌ల పారితోషికాల‌ను ఆర్జించ‌డ‌మెలానో... ఒక పాపుల‌ర్ నిర్మాత‌గా ఫ‌క్తు బిజినెస్ మేన్ గా వంద‌శాతం స‌క్సెస్ రేటుతో దూసుకెళ్ల‌డ‌మెలానో ఇతరుల‌కు నేర్పిస్తున్నార‌ని చెప్పాలి. అత‌డు ప‌ట్టింద‌ల్లా బంగారంగా మారుతోంది. బోనీ నిర్మించిన త‌మిళ తెలుగు చిత్రాలు చ‌క్క‌ని విజ‌యాలు సాధిస్తున్నాయి. మ‌రోవైపు జాన్వీ క‌పూర్ ఒక్కో సినిమాకి బాలీవుడ్ లో 3-4 కోట్ల పారితోషికం అందుకుంటూ ఏడాదికి అర‌డ‌జ‌ను సినిమాలు చేసేస్తూ మ‌రోవైపు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తోను భారీగానే ఆర్జిస్తోంది. నిర్మాత‌గా బోనీ సంపాద‌న‌కు కూతురు జాన్వీ సంపాద‌న అద‌నం. ఇదంతా ఇప్పుడు అసాధార‌ణ ఆస్తిగా మారుతోంది.

జాన్వీ కుటుంబం తాజాగా రూ. 65 కోట్లతో ముంబై ప్రైమ్ లొకేష‌న్ లో ఆస్తిని కొనుగోలు చేశారనేది తాజా వార్త‌. జాన్వీ కపూర్ కుటుంబం ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో రూ.65 కోట్లతో డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసార‌ని స‌మాచారం. 6421 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో భారీ భవనంలోని మొదటి - రెండవ అంతస్తులలో ఈ డూప్లెక్స్ ఉంది. ఈ ఆస్తిని జాన్వీ- ఆమె తండ్రి బోనీ కపూర్- సోదరి ఖుషీ కపూర్ సంయుక్తంగా కొనుగోలు చేశారు. ఈ లావాదేవీపై వారు రూ.3.90 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. 12 అక్టోబర్ 2022న రిజిస్ట్రేష‌న్ పూర్త‌యింది. హౌసింగ్ యూనిట్ ఐదు కార్ పార్కింగ్ స్లాట్ లతో అందుబాటులోకి వస్తుంది. డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ మొదటి రెండవ అంతస్తులలో ఓపెన్ గార్డెన్ ప్రాంతం.. మొదటి అంతస్తులో స్విమ్మింగ్ పూల్ తో ఉంది. 6421 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను పరిగణనలోకి తీసుకుంటే కపూర్ కుటుంబం అపార్ట్‌మెంట్ ని కొనుగోలు చేసిన ఒక్కో చదరపు అడుగు ధర చదరపు అడుగులకు దాదాపు రూ. 1 లక్ష ఉంటుంద‌ని అంచ‌నా.

ఆర్నెళ్ల క్రిత‌మే జాన్వీ క‌పూర్ దాదాపు 40కోట్ల‌తో ఒక అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేసింద‌ని వార్త‌లొచ్చాయి. అంటే ఒకే ఏడాదిలో దాదాపు 100 కోట్లు పైబ‌డిన పెట్టుబ‌డితో ఆ కుటుంబం రెండు ఇళ్ల‌ను కొనుగోలు చేసింద‌న్న‌మాట‌. పాపా బోనీక‌పూర్ 'డ‌బ్బు టు ద ప‌వ‌ర్ ఆఫ్ డ‌బ్బు!' అంటే ఏమిటో ప్ర‌త్య‌క్షంగా చూపిస్తున్నారన్న‌మాట‌!

నటి జాన్వీ కపూర్ ముంబైలో 39 కోట్ల రూపాయలతో ఇంత‌కుముందు కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం ఉంది. 23 ఏళ్ల జాన్వీ ఇప్పటివరకు అర‌డ‌జ‌ను సినిమాల్లో నటించింది. స్క్వేర్ ఫీట్ ఇండియా (SFI) నివేదిక ప్రకారం.. 7 డిసెంబర్ గ‌తంలో జుహూ భవనంలో మూడు ఫ్లాట్ ల కోసం జాన్వి ఒక ఒప్పందాన్ని ఖరారు చేసింది. SFI యాక్సెస్ చేసిన పత్రాల ప్రకారం ఫ్లాట్ కార్పెట్ ఏరియా 3456 చ‌.గ‌జాలు. 78 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ భవనంలో జాన్వీకి ఆరు కార్ పార్కింగ్‌లకు యాక్సెస్ ఉంటుంది. జాన్వీ ప్రస్తుతం లోఖండ్ వాలా లో తన తండ్రి బోనీ కపూర్ మరియు సోదరి ఖుషీతో కలిసి నివాసం ఉంటోంది. ఇక ఇటీవ‌లే జాన్వీ క‌పూర్ నుంచి త‌న రూహీ స‌హ‌న‌టుడు రాజ్ కుమార్ రావు ఓ అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేయ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇలా తండ్రి కూతుళ్లు అపార్ట్ మెంట్ల‌పై పెట్టుబ‌డులు పెట్టి వాటిని తిరిగి విక్ర‌యిస్తూ కూడా ఆర్జిస్తున్నారు.

జాన్వీ 2018లో ఇషాన్ ఖట్టర్ సరసన ధడక్ సినిమాలో తొలిసారిగా నటించింది. గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ .. జోయా అక్తర్ చిత్రం ఘోస్ట్ స్టోరీస్ అనే హారర్ ఆంథాలజీలో కూడా నటించింది. కరణ్ జోహార్ వెబ్ షో 'ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్'లో అతిధి పాత్రలో కనిపించింది. రాజ్ కుమార్ రావుతో 'రూహి అఫ్జానా' న‌టిగా మంచి పేరు తెచ్చింది. ఆ త‌ర్వాత జాన్వీ న‌టించిన గుడ్ ల‌క్ జెర్రీ త‌న‌కు మ‌రో హిట్టు.. బోనీతో క‌లిసి జాన్వీ మిలీ అనే చిత్రంలో న‌టించ‌గా అది రిలీజ్ కి రెడీ అయ్యింది. కొల్లిన్ డి కున్హా తో 'దోస్తానా 2' చిత్రీక‌ర‌ణ‌లో ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.