Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: స‌న్న‌జాజి నడుముతో సంపేసిందిగా

By:  Tupaki Desk   |   2 Nov 2019 2:30 PM GMT
ఫోటో స్టోరి: స‌న్న‌జాజి నడుముతో సంపేసిందిగా
X
గ‌త కొంత‌కాలంగా శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ నిరంత‌రం వార్త‌ల్లో నానుతోంది. ధ‌డ‌క్ చిత్రంతో తెరంగేట్రం చేసిన జాన్వీ తొలి ప్ర‌య‌త్నం స‌క్సెసైంది. ఇక మ‌లి ప్ర‌య‌త్నం అంత‌కుమించి ప్ర‌యోగాత్మ‌క క‌థ‌ల్ని ఎంచుకుని న‌టిస్తోంది. ప్ర‌స్తుతం భార‌త‌ వైమానిక ద‌ళ అధికారిణి.. సాహ‌స‌నారి గుంజ‌న్ స‌క్సేనా బ‌యోపిక్ లో న‌టిస్తోంది. దీంతో పాటే `త‌క్త్` వంటి భారీ హిస్టారిక‌ల్ చిత్రంలోనూ ఆడిపాడుతోంది.

ప‌నిలో ప‌నిగా సామాజిక మాధ్య‌మాల్లో నిరంత‌రం వేడెక్కించే ఫోటోల‌తో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు చిట్టి పొట్టి నిక్క‌ర్లు.. కుర‌చైన దుస్తుల్లో క‌నిపిస్తూ ఫ్యాన్స్ క‌న్ను తిప్పుకోకుండా చేస్తోంది. ఈ సిరీస్ లో ఇటీవ‌ల వ‌చ్చిన ఫోటోల‌న్నీ అంత‌ర్జాలంలో క‌ల్లోలం సృష్టించాయి. జిమ్ కి వెళుతూ మార్కెట్ కి వెళుతూ.. షూటింగుల కోసం విమానాశ్రయాల‌కు వెళుతూ.. చివ‌రికి పైలెట్ శిక్ష‌ణ‌ క్లాసుల‌కెళుతూ ఈ అమ్మ‌డు చూపించిన వయ్యారం వైర‌ల్ గా మారింది. దేహాన్ని అతుక్కుపోయే టైట్ డ్రెస్ లతో కుర్ర బ్యూటీ అల్లాడిస్తోంది.

తాజాగా మ‌రోసారి అదే తీరుగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీటిచ్చింది. ఈసారి వైట్ టాప్ .. బ్లాక్ ట్రాక్ ఫ్యాంట్ కాంబినేష‌న్ తో క‌నిపించింది. టాప్ అందాల్ని క‌వ‌ర్ చేస్తూ.. జానా బెత్తెడు సైజులో ఉన్న‌ వైట్ టాప్ తో టాప్ లేపేసింది. అంత‌కంత‌కు పైకి తేలిపోతున్న ఆ వైట్ టీస్ వ‌ల్ల జాన్వీ న‌డుము అందాలు అంతే అందంగా ఎలివేట్ అయ్యాయి. అస‌లే ఫిట్ నెస్ ఫ్రీక్ కావ‌డంతో జాన్వీ పొట్ట చుట్టూ ప్యాకింగ్ మ‌డ‌త‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. పెర్ఫెక్ట్ ఫిట్ టోన్డ్ బాడీ సొగ‌సు హైలైట్ అవుతోంది. ఇక ఫార్మ‌ల్ చెప్ప‌ల్స్ తొడుక్కుని హ్యాండ్ బ్యాగ్ ని గాలికి వ‌దిలేసి ఏదో సీరియ‌స్ గా ఆలోచిస్తూ బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఇంత‌కీ జాన్వీ ఎక్క‌డికి వెళ్లింది? అంటే పైలెట్ క్లాసెస్ ట్రైనింగ్ కి వెళ్లి వ‌స్తోందట‌. గుంజ‌న్ స‌క్సేనా బ‌యోపిక్ షూటింగు ఇంకా పెండింగ్ ఉంది. అందుకోస‌మే ఈ పాట్లు. జిమ్ కి వెళ్లేప్పుడే కాదు తను ఇలా పైలెట్ క్లాసుల‌కు వెళ్లినా సంథింగ్ ఏదో స్పెషాలిటీ ఉండాల్సిందే అన్న‌ట్టుగా ఉందీ డ్రెస్. మొత్తానికి క్లాసులోనూ క‌ళ్ల‌న్నీ త‌న‌పైనే అని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.