Begin typing your search above and press return to search.

రిసెప్షనిస్ట్ గా మారిన శ్రీదేవి కూతురు

By:  Tupaki Desk   |   29 May 2018 1:35 PM GMT
రిసెప్షనిస్ట్ గా మారిన శ్రీదేవి కూతురు
X
ఒకప్పుడు హీరోయిన్లు ఎలా అందాన్ని ఎలా కాపాడుకునేవాళ్ళో చెప్పలేం కానీ ఈ కాలంలో మాత్రం చాలా వరకు సమయం జిమ్ లకు అంకితం ఇస్తున్నారు. అయితే షూటింగ్ లో లేకపోతే జిమ్ లో మెరుస్తున్నారు. టాలీవుడ్ కంటే బాలీవుడ్ భామలు ఫిట్ నెస్ విషయంలో ఒక అడుగు ఎప్పుడు ముందు ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. స్టార్ హీరోయిన్లే కాదండోయ్ హీరోయిన్ అవ్వబోతున్న అమ్మాయిలు కూడా అంతే.

అలనాటి తార శ్రీదేవి - బోణీ కపూర్ ల గారాల పట్టి ఝాన్వి కపూర్ త్వరలో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. సూపర్ హిట్ సినిమా సైరట్ కు రీమేక్ గా వస్తోంది ఆ చిత్రం. షూటింగ్ లో బిజీ గా గడుపుతున్న ఝాన్వి కాళీ సమయాల్లో మాత్రం జిమ్ లో వర్కవుట్లు చేస్తూ గడిపేస్తోంది. ఇదిలా ఉండగా ఫిట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కత్రినా కైఫ్ ఈ మధ్యనే ఝాన్వి జిమ్ ఫోటో ఒకటి పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తోంది ఝాన్వి. ఈమె ఎవరైనా స్నేహితులతో మాట్లాడుతుందో లేక ఫోన్ వస్తే ఆన్సర్ చేసిందో తెలీదు కానీ చూడటానికి రిసెప్షనిస్ట్ లాగానే ఉంది.

అదే విషయాన్ని చెప్తూ "జిమ్ కు ఒక అందమైన కొత్త రిసెప్షనిస్ట్ వచ్చింది" అంటూ కత్రినా ఫొటోను పోస్ట్ చేసింది. తన స్నేహితురాలి పోజ్ నచ్చి ఫోటో తీసింది ఈ పిల్లి కళ్ళ చిన్నది అని తెలుస్తూనే ఉంది. మొత్తానికి ఝాన్వి కపూర్ జిమ్ లో బాగానే కసరత్తులు చేస్తున్నట్టు కూడా తెలియకనే తెలుస్తోంది.