Begin typing your search above and press return to search.
కాళ్లకు పట్టీలు.. జాన్వీ స్పెషల్ ట్రీట్
By: Tupaki Desk | 30 May 2019 10:46 AM GMTముంబైలోని ఖరీదైన బాంద్రా ఏరియాలో వేకువ ఝామున ఐదు గంటలకు ఓ మారు వీధుల్లో చప్పుడు వినాలి. తెలతెల్లవారుతుండగా అక్కడ సెలబ్రిటీల జాగింగ్ లు.. వాకింగ్ ల హడావుడితో పాటు జిమ్ చేసేవాళ్లతో దగ్గరలో ఉన్న సెలబ్రిటీ ఫిట్ నెస్ సెంటర్లలో సందడి మొదలవుతుంది. అక్కడ జాన్వీ కపూర్- ఖుషీ కపూర్ సందడి చూడాలి. ఈ భామలిద్దరూ పూర్తిగా స్పోర్ట్స్ వేర్ లో దర్శనమిస్తారు. జిమ్ కి పడవలాంటి కార్ లో వచ్చి వెళుతుంటారు. వీళ్ల రాకకోసం వేచి చూసే ఎన్నో కళ్లు ఆత్రంగా వెతుకుతుంటాయి. అందులో మీడియా కళ్లు లెన్స్ వేసుకుని రెడీగా ఉంటాయి.
ఇప్పటికే బాంద్రా ఏరియాలో జాన్వీ- ఖుషీ సందడికి బోలెడంత పాపులారిటీ వచ్చేసింది. ఇటీవలే జిమ్ కి వెళుతూ జాన్వీ - ఖుషీ కెమెరా కంటికి చిక్కారు. తాజాగా ఆ ఫోటోలు అందర్జాలంలో వైరల్ అయిపోతున్నాయి. ఇకపోతే జాన్వీ జిమ్మింగ్ తో పాటుగా యోగాలోనూ శిక్షణ పొందుతోంది. యోగా కోసం ప్రత్యేకించి డ్రెస్ కోడ్ ని మెయింటెయిన్ చేయడం పలుమార్లు కనిపించింది. ఆసక్తికరంగా ఈసారి బ్లూ నిక్కరు.. పైన వైట్ టాప్ ని ధరించింది. పైగా ఆ లేలేత పాదాల్ని పరిశీలిస్తే ఆ కాళ్లకు పట్టీలు కనిపించడం ఓ బిగ్ సర్ ప్రైజ్ ట్రీట్ అనే చెప్పాలి. అభిమానులు ఊహించని కొత్త ట్రీట్ ఇది.
కెరీర్ పరంగా పరిశీలిస్తే.. ధడక్ సినిమాతో కథానాయిక అయిన జాన్వీ తదుపరి వరుసగా మూడు చిత్రాలకు సంతకాలు చేసింది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న తక్త్ (సింహాసనం).. పైలెట్ గుంజన్ సక్షేనా బయోపిక్.. ఇప్పటికే సెట్స్ పై ఉన్నాయి. వీటితో పాటే ఇటీవల రూహ్ - అఫ్జా అనే ఓ హారర్ కామెడీకి సంతకం చేసింది. ఇందులో రాజ్ కుమార్ రావ్- వరుణ్ శర్మ తదితరులు నటిస్తున్నారు. హార్థిక్ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. మృగ్ దీప్ లాంబా- దినేష్ విజన్ నిర్మాతలు.
ఇక జాన్వీ తర్వాత ఖుషీ కూడా కథానాయికగా ఆరంగేట్రం చేయనుంది. ఈ విషయాన్ని ఓ లైవ్ షోలో ఖుషీ స్వయంగా రివీల్ చేసింది. అందుకే అక్కతో కలిసి రెగ్యులర్ గా జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ కఠిన నియమాల్ని పాటిస్తోంది. ఇక ఈ సిస్టర్స్ డాడ్ బోనీకపూర్ ఓవర్ ప్రొటెక్టివ్. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా వీళ్లతో పాటు ఉండే బోయ్ కి ఓ మెసేజ్ వస్తుంటుంది. ``సుపుత్రా .. మీ సిస్టర్ ని బాగా చూసుకో! వాళ్లతో ఉన్న ఓ ఫోటో పంపించు` అనేది ఆ మెసేజ్ సారాంశం!! అని ఖుషీ నేరుగా ఓ ఇంటర్వ్యూలోనే చెప్పేసి నవ్వులు పూయించింది. అదీ సంగతి.