Begin typing your search above and press return to search.
నటవారసురాలితో ఎవరా సీక్రెట్ బోయ్ ఫ్రెండ్?
By: Tupaki Desk | 17 Jun 2021 8:30 AM GMTబాలీవుడ్ లో సీక్రెట్ బోయ్ ఫ్రెండ్స్ తో కథానాయికల సహజీవనం రెగ్యులర్ గా చూసేదే. కెరీర్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగేసిన కియరా అద్వాణీ ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో సీక్రెట్ గా డేటింగ్ చేస్తోందని కథనాలొస్తున్నాయి. అలాగే స్టార్ హీరోయిన్ కత్రిన కైఫ్ యువహీరో విక్కీ కౌశల్ తో నిండా ప్రేమలో మునిగిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ రెండు జంటల షికార్లకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. షాహిద్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ తో అనన్య పాండే సీక్రెట్ డేటింగ్.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ తో సైఫ్ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్ డేటింగ్ ఇవేవీ దాగలేదు.
తాజాగా శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్ తో ఒక కొత్త బంగ్లా కొనుక్కుని అందులో సహజీవనం చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే బాటలో నటవారసురాళ్ల డేటింగ్ వ్యవహారాలపైనా నిరంతరం ఏవో కథనాలు వస్తూనే ఉన్నాయి.
అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ కూడా డేటింగ్ లో ఉంది! అంటూ తాజాగా రూమర్ పుట్టుకొచ్చింది. తాజాగా ఈ బ్యూటీ బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు రివీల్ చేయగా అందులో తన స్నేహితుడితో కలిసి బీచ్ లో రన్ చేస్తూ కనిపించింది. అతడి ముఖం రివీల్ కాకపోవడంతో జాన్వీ ఏదో దాస్తోంది! అన్న గుసగుసా వేడెక్కిస్తోంది. ఇంతకీ అతడు ఎవరు? అన్నది ఆరా తీస్తే.. జాన్వీ క్లోజ్ ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రామణి .. అతడితో జాన్వీ చెలిమి ఫోటోషూట్ వరకేనా లేక అంతకుమించి ఏదైనా జరుగుతోందా? అన్నది మునుముందు బయటపడుతుందేమో!!