Begin typing your search above and press return to search.

జాన్వీ క‌పూర్-సారా అలీఖాన్ డేటింగ్ వాళ్ల‌తోనే?

By:  Tupaki Desk   |   16 July 2022 1:30 AM GMT
జాన్వీ క‌పూర్-సారా అలీఖాన్ డేటింగ్ వాళ్ల‌తోనే?
X
సారా అలీఖాన్-జాన్వీ క‌పూర్ క్లోజ్ నెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అక్కా-చెల్లెళ్లు కాక‌పోయినా సొంత సిస్ట‌ర్స్ లా మెలుగుతారు. ఇండ‌స్ర్టీకి రాక‌ముందు నుంచే మంచి స్నేహితులిద్ద‌రు. దాదాపు ఇద్ద‌రు ఒకేసారి లాంచ్ అయ్యారు. ఇద్ద‌రి కెరీర్ బాలీవుడ్ లో దేదీప్య‌మానంగా సాగిపోతుంది. మ్యాక‌ప్ వేసుకున్న నాటి నుంచి ఆ బాండింగ్ మ‌రింత స్ర్టాంగ్ అయింది.

వృత్తి ప‌రంగా ఎంత బీజీగా ఉన్నా వీకెండ్ పార్టీల‌కు త‌ప్ప‌నిస‌రిగా క‌ల‌వాల్సిందే. ఆ రాత్రంతా ఎంజాయ్ చేయాల్సిందే. ఇద్ద‌రి మ‌ధ్యా అంత క్లోజ్ నెస్ ఉంది. తాజాగా ఈ విష‌యం తెలిస్తే వాళ్ల బాండింగ్- ప్రెండ్ షిప్ ని అంత‌కు మించి క‌నిపిస్తుంద‌ని తెలుస్తోంది. అక్కా చెల్లిలా మెలిగే ఇద్ద‌రు ఏకంగా అన్న‌ద‌మ్ముల‌తోనే డేటింగ్ చేసిన విష‌యం వెలుగులోకి వ‌స్తోంది.

విష‌యం పాత‌దే అయినా వాళ్లిద్ద‌రు అన్నద‌మ్ములు అన్న విష‌యం బ‌య‌ట పెద్ద‌గా తెలియ‌దు. దీంతో మ్యాట‌ర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జాన్వీ-సారా ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ తోనే కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన‌ట్లు తాజాగా కాపీ విత్ క‌ర‌ణ్ షోలో రివీల్ అయింది. సారా-జాన్వీ డేటింగ్ చేసిన అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రు వీళ్లే.

వారి పేర్లు వీర్ ప‌హారియా- శిఖ‌ర్ ప‌హారియా. వీరిద్ద‌రు మాహ‌రాష్ర్ట మాజీ ముఖ్య‌మంత్రి సుశీల్ కుమార్ షిండే మ‌న‌వ‌ళ్లు. లాక్ డౌన్ స‌మ‌యంలో ప‌హారియా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రు జాన్వీ-సారా ఇంటిప్క‌నే ఉండేవారుట‌. అదే స‌మ‌యంలో వాళ్ల‌తో స్నేహం..అపై డేటింగ్ మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి జాన్వీ షిండే మ‌న‌వ‌డితో ల‌వ్ లో ఉంద‌ని చాలా కాలం క్రిత‌మే వైర‌ల్ అయింది.

ఇదే విష‌యాన్ని క‌ర‌ణ్ త‌న షోలో ఓపెన్ గా చెప్పేసారు. దీంతో జాన్వీ-సారా కాస్త ఫీలైన‌ట్లు క‌నిపించింది. ఇలాంటి విష‌యాలు ఇంత ఓపెన్ గా ఎలా చెప్పేస్తావ్ క‌ర‌ణ్ అంటూ క‌సుబుసులాడారు. దీంతో ట్రోల‌ర్ల‌కి..నెటి జ‌నుల‌కు కావాల్సినంత స‌ప్ట దొరికిన‌ట్లు అయింది. ఆ జంట‌ల పాత ఫోటోలు..వీడియోలు తీస్తూ అజ‌రామ‌ర ప్రేమికులు ఇప్పుడు ఏమయ్యారంటూ సెటైర్లువే య‌డం మొద‌లు పెట్టారు.

ఓ వైపు టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేర‌కొండ‌తో భామా మ‌ణులిద్ద‌రు క‌లిసి డేటింగ్ చేస్తామంటారు? మ‌రి దీనికి ఆయ‌న ఒప్పుకోవ‌ద్దా? అంటూ సెటైర్లు ప‌డుతున్నాయి. ఇప్పుడీ ఈ పాత ఫోటోలు త‌వ్వి బ‌య‌ట‌కు తీయ‌డంతో ముక్కున వేలేసుకోవాల్సిన ప‌రిస్థితి దాప‌రించింది.