Begin typing your search above and press return to search.

జిమ్ నుంచి బ‌య‌ట‌కు రాగానే మీదప‌డ్డారంతే

By:  Tupaki Desk   |   10 Jan 2023 3:52 AM GMT
జిమ్ నుంచి బ‌య‌ట‌కు రాగానే మీదప‌డ్డారంతే
X
చ‌క్క‌ని చుక్క జాన్వీ క‌పూర్ కి యువ‌త‌రంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ధ‌డ‌క్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ అప్ప‌టికీ ఇప్ప‌టికీ చాలా న‌ట‌వైవిధ్యం చూపిస్తోంది. చ‌క‌చ‌కా వ‌రుస సినిమాలు చేస్తూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. దానికి మించి సోష‌ల్ మీడియాల్లో ఫాలోవ‌ర్స్ ని పెంచుకునేందుకు జాన్వీ అనుస‌రిస్తున్న ఎత్తుగ‌డ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

అలా జిమ్ కి వెళుతూ లేదా యోగా క్లాసుల‌కు వెళుతూ జాన్వీ చిట్టి పొట్టి నిక్క‌ర్ల‌లో క‌వ్విస్తోంది. టైట్ టాప్ ల‌తో టాప్ లేపేస్తోంది. అస‌లు ఒంటిపై ఆ రెండు పేలిక‌లు అయినా స్థిరంగా నిలుస్తాయా? అన్న సందేహం క‌లగ‌క మాన‌దు! అయితే జాన్వీ జిమ్ కి వెళ్లినా మార్కెట్ కి వెళ్లినా లేదా రెస్టారెంట్ ప‌బ్బు క్ల‌బ్బు ఎక్క‌డికి వెళ్లినా త‌న‌ని వెంటాడే కెమెరా క‌ళ్లు ఎప్పుడూ ఉండ‌నే ఉంటాయి. తాజాగా జాన్వీకి చెందిన‌ ఒక రేర్ క్లిక్ ఒక‌టి యూత్ లో వైర‌ల్ గా మారింది.

జాన్వీ ముంబైలో యాంటీ గ్రావిటీ అనే జిమ్ కి వెళ్లి తిరిగి వ‌స్తున్న‌ప్పుడు కొంద‌రు అభిమానులు త‌న‌ను వెంబ‌డించారు. త‌న‌తో సెల్ఫీలు దిగేందుకు ఆరాట ప‌డ్డారు. అయితే జాన్వీ ఎందుక‌నో ఆ స‌మ‌యంలో చాలా అసౌక‌ర్యంగా క‌నిపించింది.

బోయ్స్ తో సెల్ఫీలు దిగుతుంటే మీది మీదికి వ‌చ్చేస్తూ త‌న‌ని చాలా ఇబ్బంది పెట్టారు. ఇక ఆ స‌న్నివేశంలో జాన్వీ పొట్టి నిక్క‌రు ధ‌రించి నాభి సౌంద‌ర్యాన్ని కాళ్ల సౌంద‌ర్యాన్ని ప్ర‌ద‌ర్శించిన తీరుకు గుబులు పుట్టింది. బ్లాక్ అండ్ బ్రింజాల్ క‌లర్ డ్యూయ‌ల్ షేడ్ టాప్ తో అద‌ర‌గొట్టింది. ఓవైపు స్మైలిస్తూ సెల్ఫీలు దిగుతోంది కానీ ఎంతో కొంత ఇబ్బంది ఫీలైంది పాపం!!

అయితే జాన్వీ కపూర్ అసౌకర్యంగా ఫీలైనా కానీ మేల్ ఫ్యాన్స్ అంద‌రితో కలిసి పోజులిచ్చినందుకు నెటిజ‌నుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. నిజానికి జాన్వీ కపూర్ జిమ్ కి వెళ్లే ప్ర‌తిసారీ ఆక‌ర్ష‌ణీయ‌మైన స్పోర్ట్స్ వేర్స్ తో మేక‌ప్ లెస్ గా సాధారణ రూపంతో క‌నిపిస్తుంది. జాన్వీ కపూర్ ఫిట్ బాడీతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేందుకు చాలా క‌స‌ర‌త్తులు చేస్తుంది. నిరంత‌రం వ్యాయామాలు..డైట్ ప్లాన్ లతో అప్ర‌మ‌త్తంగా ఉంటుంది. అదే క్ర‌మంలో జాన్వీ సొగ‌సు యువ‌త‌రానికి ఫుల్ కిక్ ఇస్తోంది.

టాలీవుడ్ ఎంట్రీపై గుస‌గుస‌లు

గత కొన్నేళ్లుగా అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ బాలీవుడ్ కే ప‌రిమిత‌మైంది. కానీ తొంద‌ర్లోనే టాలీవుడ్ లో ఆరంగేట్రం చేయ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఏడాది కాలంగా జూ.ఎన్టీఆర్- కొర‌టాల శివ కాంబినేష‌న్ సినిమాతోనే జాన్వీ ఎంట్రీకి అవ‌కాశం ఉంద‌ని కూడా క‌థ‌నాలొస్తూనే ఉన్నాయి. జాన్వీ క‌పూర్ టాలీవుడ్ ఎంట్రీకి ఒప్పించాల‌ని ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్నారని....జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఖాయ‌మైన‌ట్టేన‌ని టాక్ వినిపించింది. కానీ నిర్మాతలు ఇంకా అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంటుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.