Begin typing your search above and press return to search.
చిట్టిబాబుతో స్టెప్పులెలా ఉంటాయంటే..
By: Tupaki Desk | 5 Feb 2018 4:17 AM GMTప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అందరి చూపు సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు వైపే ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన లేటెస్ట్ ఫిలి రంగస్థలం టీజర్ లో చిట్టిబాబు పాత్రలో నిమిషం పాటే కనిపించినా అభిమానులకు అది విపరీతంగా నచ్చేసింది. టీజర్ రిలీజ్ తరవాత అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.
రంగస్థలం పీరియాడికల్ మూవీ. 1985 ప్రాంతంలో గోదావరి తీరంలోని రంగస్థలమనే గ్రామాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆనాటి పల్లె జీవనానికి తగ్గట్టు ఇందులో రామ్ చరణ్ పూల డిజైన్ లుంగీ.. గుబురు గెడ్డంతో కనిపించనున్నాడు. ఈలుక్ లో రామ్ చరణ్ అదరగొట్టాడనే చెప్పాలి. అదే లుంగీ పైకెత్తి స్టెప్పులేస్తే అభిమానులు విజిల్స్ తో మోత మోగించేయాలి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అదే పనిలో పడ్డాడు. అచ్చు రామ్ చరణ్ లా గడ్డం పెంచి.. అదేటైపు లుంగీ.. బనీన్ కట్టాడు. తన టీం అందరితో మాస్ డ్రస్సులేయించి మరీ స్టెప్పులు ప్రాక్టీస్ చేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.
జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నది ఈ సినిమాలో మాస్ సాంగ్ కేనని తెలిసిపోతూనే ఉంది. సుకుమార్ సినిమాల్లో వచ్చే ఐటం ఎప్పుడూ ఓ రేంజిలోనే ఉంటుంది. ఆర్యలో అ అంటే అమలాపురం.. ఆర్య-2లో రింగరింగా.. 100 % లవ్ లో డియ్యాలో డియ్యాలో సాంగులన్నీ మ్యూజికల్ గా ట్రెమండస్ హిట్లే. మరి ఈ సినిమాలో పాట స్టెప్పులను చూస్తే అదే రేంజిలో మోత మోగేట్టే ఉంది.