Begin typing your search above and press return to search.

RC15 ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన మాస్టర్‌

By:  Tupaki Desk   |   13 Oct 2022 8:30 AM GMT
RC15 ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన మాస్టర్‌
X
రామ్‌ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఆంద్ర ప్రదేశ్‌ లోని రాజమండ్రిలో జరుగుతున్న విషయం తెల్సిందే. ఫ్ల్యాష్‌ బ్యాక్ ఎపిసోడ్స్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారని సమాచారం అందుతోంది. ఇటీవల లీక్ అయిన చరణ్‌ మరియు అంజలి వింటేజ్‌ లుక్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

సినిమా గురించి మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు మరియు తమిళ సినీ ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ను దిల్‌ రాజు భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు కొరియోగ్రఫర్ గా వ్యవహరిస్తున్న జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌ తాజాగా ఆర్ సీ 15 సినిమాకు ఒక పాటకు డాన్స్ కంపోజ్ చేయడం జరిగిందట. ఇప్పటి వరకు చేసిన పాటలు ఒక ఎత్తు అయితే ఇది మరో లెవల్‌ అన్నట్లుగా జానీ మాస్టర్ వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది. రామ్‌ చరణ్‌ పై తనకు ఉన్న అభిమానం మొత్తం చూపించి డాన్స్ ను కంపోజ్‌ చేసినట్లుగా జానీ మాస్టర్‌ అన్నాడు.

ఇక ఆ పాట కూడా అద్భుతంగా వచ్చిందని.. థమన్‌ కూడా తన బెస్ట్‌ ఇవ్వడంతో పాట అద్భుతంగా వచ్చిందని పేర్కొంది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ పాట గురించి.. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ మరియు థమన్‌ ట్యూన్స్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

సినిమా గురించిన ప్రతి చిన్న విషయం కూడా అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి. తాజాగా జానీ మాస్టర్‌ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచేస్తున్నాయి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాది లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.