Begin typing your search above and press return to search.
వామ్మో... జపాన్ నుంచి అన్ని గిఫ్టులా
By: Tupaki Desk | 15 May 2018 5:30 PM GMTబాహుబలి ఇండియాలో ఎంత పెద్ద హిట్ కొట్టిందో జపాన్‌లో అంతకుమించిపోయిన హిట్ అందుకుంది. కొన్ని థియేటర్లలో శతదినోత్సవం కూడా జరుపుకుంది. ఈ సందర్భంగా బాహుబలి దర్శక నిర్మాతలు జపాన్ వెళ్లొచ్చి స్వాగత సత్కారాలు అందుకున్నారు. అక్కడనుంచి ఓ వారం రోజుల క్రితమే తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి ఇన్ స్టాగ్రామ్‌లో తమకు వచ్చిన బహుమతుల గురించి చెప్పుకుంటూ వచ్చారు.
ఇప్పటికే తాము ఎన్నో దేశాలు తిరిగామని కానీ తమకు నచ్చింది మాత్రం జపానేనని చెబుతున్నాడు జక్కన్న. ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో బాహుబలి ఫోటోను చేతితో పట్టుకుని చుట్టు గిఫ్ట్ బాక్సులు ఉన్న ఫోటోను పోస్టు చేశారు. జపాన్ వాళ్లు స్వాగత సత్కారాలు ఎప్పటికీ మరువలేమని గుర్తు చేసుకున్నారు. తమ మీద తమ సినిమా మీద వారు చూపించిన ప్రేమకి ధన్యవాదాలు చెప్పారు. జపాన్ నుంచి బయలుదేరిన తమను బహుమతులతో ముంచేశారు అక్కడి అభిమానులని వివరించారు. ఇప్పుడు వాటిని తెరిచి ఒక్కొక్కటిగా చూస్తున్నామని ఒక్కో బహుమతి చాలా అందంగా ఉన్నాయని చెప్పారు. ప్రభాస్ రానాలకు వచ్చిన బహుమతులను ఓపెన్ చేయకుండా అలానే ఉంచామని వారిని కలిశాక వాటిని ఇస్తామని తెలిపాడు. జపాన్ వాసులు చూపించిన ప్రేమకు జక్కన్న ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు.
జపాన్ లో గతేడాది డిసెంబర్ 29న బాహుబలి సెకండ్ పార్ట్ విడుదలైంది. ఇప్పటివరకు ఇంకా కొన్ని థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఇప్పటి వరకు 1.3 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈ సందర్భంగా అక్కడి జపనీస్ డిస్ట్రిబ్యూటర్లు వేడుక చేశారు. ఆ వేడుకకు జక్కన్న నిర్మాత శోభు యార్లగడ్డ జపాన్ వెళ్లారు. అక్కడి జపాన్ అభిమానులతో ఖుషీగా గడిపి తిరుగుప్రయాణమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి రూ.1700 కోట్లు వసూలు చేసింది.