Begin typing your search above and press return to search.
జపాన్ రజనీ రికార్డ్.. RRR బ్రేక్ చేస్తుందా?
By: Tupaki Desk | 20 Oct 2022 4:30 PM GMTఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా అనువాదం అవుతోంది. ఓటీటీ లోనే చాలామంది విదేశీయులు సినిమాను చూశారు. భాషతో సంబంధం లేకుండా యాక్షన్స్ సన్నివేశాలు అయితే ఒక రేంజ్ లో ఆకట్టుకున్నయని హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు.
అయితే ఇప్పుడు వివిధ దేశాల్లో RRR సినిమా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమయింది. ముఖ్యంగా జపాన్లో ఈ సినిమాను ప్రత్యేకంగా విడుదల చేయబోతున్నారు. ఇదివరకే దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమాను అక్కడ విడుదల చేయగా మంచి కలెక్షన్స్ అందుకుంది.
అలాగే అక్కడ సాహో సినిమా కూడా ఇంతకుముందు విడుదల అయింది. అది కూడా జపాన్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
అయితే ఇటీవల కాలంలో ఎన్ని సినిమాలు జపాన్లో విడుదలవుతున్నా కూడా 27 ఏళ్ల క్రితం రజనీకాంత్ క్రియేట్ చేసిన రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోతున్నాయి. 1995లో రజనీకాంత్ నటించిన ముత్తు సినిమా జపాన్ లో విడుదల అయింది. అక్కడ ఈ సినిమా ¥400M మిలియన్ల కలెక్షన్స్ అందుకుంది. అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో 20 కోట్లతో సమానం. ఇక ఇప్పుడు RRR ఆ సినిమా రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.
ఎన్టీఆర్ రామ్ చరణ్ అలాగే దర్శకుడు రాజమౌళి కూడా అక్కడ సినిమాను ప్రమోట్ చేసేందుకు వెళ్లారు. ప్రమోషన్స్ లో వారికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదివరకే ట్రైలర్ విడుదల చేయగా మంచి క్రేజ్ అందుకుంది. తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుంది అనే నమ్మకంతో ఉన్నారు.
జపాన్లో రాజమౌళి సక్సెస్ అందుకుంటే భవిష్యత్తులో మరో సినిమా కూడా అది హెల్ప్ అవుతుంది. అందుకే ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ముత్తు సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.