Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ వారసుడి లాంచింగ్‌ కోసం 'ఉప్పెన' ??

By:  Tupaki Desk   |   18 Feb 2021 3:45 AM GMT
సూపర్‌ స్టార్‌ వారసుడి లాంచింగ్‌ కోసం ఉప్పెన ??
X
తమిళ సూపర్‌ స్టార్ విజయ్‌ తనయుడు జాసన్‌ సంజయ్‌ హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు అంటూ గత రెండేళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆ వార్తలను విజయ్‌ కొట్టి పారేస్తూ వచ్చాడు. విజయ్ తన కొడుకు ను హీరోగా పరిచయం చేసేందుకు మంచి సమయం మరియు మంచి కథ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. ఎట్టకేలకు విజయ్ వద్దకు ఒక మంచి కథ చేరిందట. అదే మన 'ఉప్పెన' కథ. ఇటీవలే విడుదల అయిన ఉప్పెన సినిమా యూత్‌ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కథ కూడా చాలా విభిన్నంగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే జాసన్‌ సంజయ్‌ ఎంట్రీకి ఇదే మంచి కథ అంటూ విజయ్‌ భావిస్తున్నాడని తమిళ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలుగులో వచ్చిన అర్జున్‌ రెడ్డి సినిమాను తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ హీరోగా రీమేక్‌ చేశారు. ధృవకు ఆ సినిమా మంచి ప్రారంభంను ఇచ్చింది. అందుకే ఇప్పుడు ఉప్పెన రీమేక్ తో తన కొడుకును లాంచ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో విజయ్‌ ఉన్నాడని అంటున్నారు. విజయ్‌ ఇప్పటి వరకు ఉప్పెన చూశాడా లేదా అనే విషయమై క్లారిటీ రాలేదు. కాని ఉప్పెన గురించి ఆయన ఇప్పటికే విన్నాడని మాత్రం తమిళ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఉప్పెన సినిమా రీమేక్‌ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. రీమేక్‌ రైట్స్‌ ను ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయమై క్లారిటీ రాలేదు.

వైష్ణవ్ తేజ్.. కృతి శెట్టి హీరో హీరోయిన్‌ గా పరిచయం అయిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. లాంగ్ రన్‌ లో ఖచ్చితంగా వంద కోట్లను రాబట్టడం ఖాయం అన్నట్లుగా సినీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. వంద కోట్ల సినిమా అవ్వడం వల్లే ఉప్పెన కథతో తన కొడుకును లాంచ్ చేస్తే బాగుంటుందని విజయ్ అనుకోవచ్చు. అయితే జాసన్‌ సంజయ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. విజయ్‌ కొడుకు హీరోగా ఉప్పెన తమిళంలో రీమేక్‌ చేస్తే విజయ్‌ సేతుపతి అక్కడ కూడా అదే పాత్రలో కనిపించే అవకాశం ఉంది.