Begin typing your search above and press return to search.
వార్నీ.. క్రిస్మస్ రేసులో ఐదో సినిమా
By: Tupaki Desk | 9 Dec 2015 3:30 PM GMTటాలీవుడ్ లో బిగ్గెస్ట్ సీజన్ అంటే సంక్రాంతే. ఆ పండక్కి ఒకేసారి నాలుగైదు సినిమాలు వచ్చేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ బండి వారం రెండు వారాలే నడుస్తుండటంతో ఇంతకుముందులా ఎక్కువ సినిమాలు పోటీ పడట్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి రెండు సినిమాలే వచ్చాయి. అది కూడా మూడు రోజుల గ్యాప్ లో విడుదలయ్యాయి. మిగతా పండగలకి కూడా పెద్దగా పోటీ లేదు. దీపావళికి ఒకే సినిమా విడుదల కాగా.. దసరాకు మూడు సినిమాలొచ్చాయి. ఐతే ఆశ్చర్యకరంగా ఈ క్రిస్మస్ కి ఏకంగా ఐదు సినిమాలు లైన్ లో నిలిచాయి.
డిసెంబర్ అన్నది అసలు అన్ సీజన్. క్రిస్మస్ కి మన దగ్గర పెద్దగా ప్రాధాన్యం కూడా ఉండదు. అలాంటి పండక్కి ఏకంగా ఐదు సినిమాలు పోటీ పడుతుండటం ఆశ్చర్యకరమే. నిన్న నాలుగో సినిమాగా ‘అబ్బాయితో అమ్మాయి’ ఫిక్స్ అయినపుడే ఆశ్చర్యపోయారంతా. ఇక ఈ రోజు ఇంకో సినిమా లైన్ లోకి వచ్చింది. ‘రాజు గారి గది’లో హీరోగా నటించిన అశ్విన్ (ఓంకార్ తమ్ముడు), తేజస్వి జంటగా నటించిన ‘జత కలిసే’ కూడా క్రిస్మస్ రిలీజ్ కు ఫిక్సయింది. రాఘవేంద్రరావు నిర్వహించిన ‘రేపటి దర్శకులు’ కాంటెస్ట్ లో ప్రతిభ చాటుకున్న రాకేశ్ శశి ఈ చిత్రాన్ని రూపొందించాడు. నరేష్ రావూరి నిర్మించిన ఈ చిత్రం సాయి కొర్రపాటికి తెగ నచ్చేసి ఆయనే సొంతంగా విడుదల చేస్తున్నారు. సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ ఇప్పటికే నాలుగు సినిమాలు పోటీలో ఉన్న డేటుకే రిలీజ్ చేయాలనుకోవడం టూమచ్. మామ మంచు అల్లుడు కంచు - సౌఖ్యం - భలే మంచి రోజు కూడా క్రిస్మస్ కే విడుదల కాబోతున్నాయి. చివరికి వీటిలో రేసులో నిలిచేవి ఎన్నో.