Begin typing your search above and press return to search.
చివరికలా 'జాతిరత్నాలు'కే సాయమయ్యారు..!
By: Tupaki Desk | 21 March 2021 2:30 AM GMTచెడులోనూ మంచినే వెతకాలి! చూస్తుంటే ఈ వారం రిలీజైన మూడు సినిమాలు మిశ్రమ స్పందనలతో బాక్సాఫీస్ రేసులో బ్యాక్ బెంచీకే పరిమితమవ్వడం `జాతిరత్నాలు`కి పెద్ద సాయంగా మారిందన్నది ట్రేడ్ విశ్లేషణ. ఇప్పటికే జాతిరత్నాలు తొలి వారం చక్కని షేర్ వసూళ్లతో నిర్మాతలకు పంపిణీదారులకు లాభాల పంట పండించింది. ఈ వారం కూడా ఈ సినిమా హవానే సాగుతుందనేది ఓ విశ్లేషణ.
మంచు విష్ణు నటించిన మోసగాళ్లు ఎంపిక చేసుకున్న పాయింట్ బావున్నా తెరకెక్కించిన విధానంలో ఆశించినంత మ్యాటర్ లేకపోవడంతో ఆ సినిమాపై క్రిటిక్స్ పెదవి విరిచేశారు. సహజంగానే మంచు విష్ణు సినిమాలకు ఓపెనింగులు ఉండవు. మిశ్రమ స్పందనలతో మోసగాళ్లు జనాల్ని థియేటర్లకు రప్పించడం కష్టమేనన్న భావన నెలకొంది.
మరోవైపు కార్తికేయ `చావు కబురు చల్లగా` చిత్రానికి యావరేజ్ అన్న టాక్ వచ్చింది. ఇది కూడా నేపథ్యం బావున్నా.. క్రిటికల్ గా మెప్పించలేకపోయింది. ఇక యువహీరో ఆది నటించిన శశి యథావిధిగానే ఫ్లాప్ అని తేల్చేశారు. ఆ క్రమంలోనే ఇవన్నీ బాగా ఆడుతున్న జాతిరత్నాలు చిత్రానికి ప్లస్ అవుతున్నాయని టాక్ వినిపిస్తోంది. చాలా సింపుల్ పాయింట్ తో తెరకెక్కి ఫన్ రైడర్ గా కడుపుబ్బా నవ్విస్తున్న ఈ చిత్రానికి రిపీట్ ఆడియెన్ పెద్ద ప్లస్ అవుతున్నారన్న టాక్ ఉంది. ఈ సినిమాకి ఏపీ వసూళ్లలో డ్రాప్ ఉన్నా నైజాంలో చక్కని వసూళ్లతో రన్ అవుతోంది.