Begin typing your search above and press return to search.

'జాతిరత్నాలు' వాస్త‌వ లాభాల లెక్క‌లివీ..

By:  Tupaki Desk   |   23 April 2021 4:30 AM GMT
జాతిరత్నాలు వాస్త‌వ లాభాల లెక్క‌లివీ..
X
సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద‌ లాంగ్ రన్ లో ఊహకందని కలెక్షన్స్ ని దక్కించుకుంది జాతిర‌త్నాలు. సినిమా టోటల్ రన్ పూర్త‌య్యే నాటికి తెలుగు రాష్ట్రాల నుండే 32 కోట్లకు పైగా షేర్ వ‌సూలు చేయ‌గా ఓవ‌రాల్ గా 38కోట్ల షేర్ వ‌సూలు చేసింద‌ని ట్రేడ్ చెబుతోంది.

ఫుల్ ర‌న్ షేర్ వివ‌రాలు ప‌రిశీలిస్తే... నైజాం-16కోట్లు.. సీడెడ్ -4.27కోట్లు.. ఉత్త‌రాంధ్ర‌-3.97కోట్లు.. తూ.గో జిల్ఆ-1.92కోట్లు.. ప‌.గో జిల్లా-1.52కోట్లు.. గుంటూరు-2.08కోట్లు.. కృష్ణ‌-1.85కోట్లు.. నెల్లూరు-91ల‌క్ష‌లు.. ఏపీ తెలంగాణ క‌లుపుకుని 32.52కోట్లు వ‌సూలైంది. క‌ర్నాట‌క ఇత‌ర భార‌త‌దేశం క‌లుపుకుని 1.72కోట్లు .. అమెరికా విదేశాల నుంచి 4.28కోట్లు వ‌సూలైంది. ఓవ‌రాల్ గా 38.52 కోట్లు వ‌సూలు చేసింది. 64.20 కోట్ల ఓవ‌రాల్ గ్రాస్ వ‌సూలైంది. సినిమా టోటల్ రన్ లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ లెక్కలివి. పెద్దగా టికెట్ హైక్స్ లాంటివి లేకుండానే ఈ వ‌సూళ్ల‌ను సాధించింది.

బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాల్లో ఉప్పెన త‌ర్వాత ఈ సీజ‌న్ లో పెద్ద విజ‌య‌మిది. ఈ సినిమా మొత్తం 11 కోట్ల బిజినెస్ చేసి.. 11.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం రన్ పూర్త‌య్యేప్ప‌టికి 27.02 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇటీవ‌ల చిన్న సినిమాల్లో అతి పెద్ద ప్రాఫిటబుల్ మూవీగా నిలిచి సంచలనం సృష్టించింది. అనుదీప్ కెవి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ నిర్మాత‌. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి- ప్రియదర్శి- రాహుల్ రామకృష్ణ- ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషించారు.