Begin typing your search above and press return to search.
దళపతి రికార్డునే కొట్టేసిన జాతిరత్నాలు!
By: Tupaki Desk | 14 March 2021 7:30 AM GMTఅంతా సానుకూలంగా ఉంటే అమెరికా మార్కెట్ టాలీవుడ్ కి మరో నైజాంలా కలిసొస్తుందని నిరూపణ అయ్యింది. ప్రస్తుతం కరోనా మహమ్మారీ అమెరికాను వీడక ఇబ్బంది పెడుతున్నా మొన్న రిలీజైన జాతిరత్నాలు బంపర్ కలెక్షన్లతో దూసుకుపోవడం ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజైన `మాస్టర్` రికార్డుల్ని బ్రేక్ చేయడం చూస్తుంటే షాక్ తినకుండా ఉండలేం. అంతా నవతరం కమెడియన్లతో రూపొందించిన ఈ సినిమాని ఎన్నారైలు గొప్పగా ఆదరించడంతోనే ఈ కలెక్షన్లు సాధ్యమయ్యాయని తెలిసింది. జాతి రత్నాలు కేవలం 4 రోజుల్లో సూపర్ స్టార్ విజయ్ సినిమాను కొట్టేయడం చూస్తుంటే అమెరికాలో ఏ స్థాయి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు.
వాణిజ్య వర్గాల సమాచారం ప్రకారం ఈ వారాంతంలో జాతిరత్నాలు 750 K వసూలు చేస్తుంది. కోవిడ్ విలయంలోనూ ఇంత పెద్ద వసూళ్లతో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది. ఫుల్ రన్ లో కేవలం అమెరికా నుంచి 6-7 కోట్లు (1 మిలియన్) వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
నిజానికి క్రైసిస్ లేకపోతే అమెరికా నుంచి ఈ చిత్రం 2 మిలియన్ డాలర్లు వసూలు చేసేదని అంచనా వేస్తున్నారు. గీతా గోవిందం- పెళ్లి చూపులు-అర్జున్ రెడ్డి తరహాలోనే కంటెంట్ ఉన్న సినిమా ఇది అని ప్రూవైంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.
నవీన్ పోలిశెట్టి- ప్రియదర్శి- రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన `జాతి రత్నలు` మార్చి 11 న థియేటర్లలో రిలీజైంది. అనుదీప్ కెవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫన్నీ ఎంటర్ టైనర్ గా విమర్శకుల ప్రశంసలు అందుకుని తెలుగు రాష్ట్రాలు సహా విదేశాల్లోనూ చక్కని వసూళ్లను సాధిస్తోంది.