Begin typing your search above and press return to search.
జంధ్యాల ఈవీవీ జోనర్ జాతిరత్నాలు మావాళ్లు!
By: Tupaki Desk | 27 Feb 2021 4:10 AM GMTఏజెంట్ ఆత్రేయ నవీన్ పోలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం `జాతి రత్నాలు`. ప్రియదర్శి పులికొండ- రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనుదీప్ కె వి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని స్వప్న సినిమా(మహానటి నిర్మాతలు) పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా `జాతి రత్నాలు` మార్చి 11న విడుదలవుతోంది. ఇదివరకు రిలీజ్ చేసిన మొదటి సింగిల్ చిట్టి లిరికల్ వీడియో ఆకట్టుకుంది.
జోగిపేట శ్రీకాంత్ గా మొదటి జాతి రత్నం నవీన్ పోలిశెట్టి పరిచయం ఆకట్టుకుంది. తాజాగా నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ దర్శకుడు అనుదీప్ ని ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ మూవీని పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ జోనర్ లో తెరకెక్కించినందుకు ప్రశంసలు కురిపించారు. ``జంధ్యాల.. ఈవీవీ... ఎస్వీ కృష్ణారెడ్డి నా అభిమాన దర్శకులు. మన సినిమాల్లో హాస్యం తక్కువవుతోంది అనిపించినప్పుడల్లా వారి సినిమాలను చూసి ఆనందిస్తాం. పదేళ్ల తర్వాత కూడా ఎంజాయ్ చేసే సినిమా తీయాలని అనుకున్నాం. జాతి రత్నలు అలాంటి సినిమా. నాతో పాటు.. ఈ చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ నిజమైన జాతి రత్నలు``అని ఆయన అన్నారు. జాతిరత్నాలు విజయంపై ఒక నిర్మాతగా నాగ్ అశ్విన్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయిక. రధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సిద్దం మనోహర్ ఛాయాగ్రాహణం అందిస్తుండగా.. అభినవ్ రెడ్డి దండా ఎడిటింగ్ చేస్తున్నారు. మురళి శర్మ- నరేష్ వికె - బ్రహ్మజీ- తనికెళ్ల భరణి- వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.